భారతదేశ ఐటి రాజధాని బెంగళూరులో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు హింసాకాండ సంఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత జనవరి 16న, నెక్సస్ శాంతినికేతన్ మాల్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఒక భీకర సంఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హెల్మెట్ లేకుండా స్కూటర్ పై వెళ్తున్న ఒక వ్యక్తి, తన ప్యాంటు వెనుక భాగంలో ఒక పెద్ద కత్తిని దాచుకున్నాడు. సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, తన వెనుక ఉన్న కారు డ్రైవర్ వైపు తిరిగిన ఆ వ్యక్తి, అకస్మాత్తుగా కత్తిని తీసి “శబ్దం చేయకు!” (Awaj Nhi Karna) అంటూ బెదిరించాడు.
అంతేకాకుండా, కారు డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన ఆ వ్యక్తి, సిగ్నల్ పడగానే అక్కడి నుండి చాలా ప్రమాదకరంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలన్నీ కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరా (Dashcam) లో స్పష్టంగా రికార్డయ్యాయి.
పెరుగుతున్న రోడ్డు హింస:
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో చిన్నపాటి ట్రాఫిక్ గొడవలకు కూడా ఆయుధాలతో బెదిరించడం వంటి అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.
