గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజల కలను నైజం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G). ప్రధాని మోదీ నాయకత్వంలో 2022 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకాన్ని ఇప్పుడు 2029 వరకు పొడిగించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, పత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఆర్థిక సహాయం ఎంత?
- సాధారణ ప్రాంతాలు: ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 1.20 లక్షల నేరుగా అందిస్తుంది.
- కొండ ప్రాంతాలు/దుర్భర ప్రాంతాలు: రూ. 1.30 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
- అదనపు ప్రయోజనాలు: ఇంటి పైకప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 50,000 వరకు ఇస్తుంది. ‘స్వచ్ఛ భారత్’ కింద మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ. 12,000 అదనంగా లభిస్తాయి.
- ఉపాధి: ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఇల్లు కట్టుకునే పని కోసం 90 రోజుల వేతనం కూడా లభిస్తుంది.
ఎవరు అర్హులు?
- దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి మరియు 18 ఏళ్లు నిండి ఉండాలి.
- దేశంలో ఎక్కడా సొంతంగా పక్కా ఇల్లు ఉండకూడదు.
- రేషన్ కార్డు లేదా బిపిఎల్ (BPL) జాబితాలో పేరు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, వికలాంగులు, మాజీ సైనికులు మరియు ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎవరు అనర్హులు?
- మూడు లేదా నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్లు ఉన్నవారు.
- నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు.
- ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు.
- 2.5 ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్నవారు.
- రూ. 50,000 కంటే ఎక్కువ పరిమితి ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు.
కావలసిన పత్రాలు:
- ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం.
- ఆధార్ కార్డు, పాన్ కార్డు.
- బ్యాంక్ పాస్బుక్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో.
- సొంత ఇల్లు లేదని తెలిపే అఫిడవిట్.
