మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని ఒక అపార్ట్మెంట్లో 77 ఏళ్ల గిరి గోస్వామి అనే వృద్ధుడు లిఫ్ట్ గుంతలో (Duct) పడి మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
గత 10 రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆయన రహస్యంగా కనిపించకుండా పోయారు. ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయన గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో, లిఫ్ట్ ప్రాంతం నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో అధికారులు తనిఖీ చేయగా, లిఫ్ట్ గుంత అడుగున వృద్ధుడి మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనుగొనబడింది.
గత 10 రోజులుగా ఆ లిఫ్ట్ వృద్ధుడి మృతదేహంపైనే పైకి, కిందకు తిరగడంతో శరీరం పూర్తిగా నలిగిపోయి గుర్తుపట్టలేనంతగా తయారైంది. ఆ అపార్ట్మెంట్లోని లిఫ్టులు చాలా కాలంగా పాడైపోయి ఉన్నాయని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదని నివాసితులు ఆరోపిస్తున్నారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలైందని స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
