బియ్యం కడిగిన నీటిని వేస్ట్ అని పారబోయకండి.. ఈ రకాలుగా ఉపయోగించండి!

సాధారణంగా ప్రతి ఇంట్లో అన్నం వండుతారు. ఆ సమయంలో బియ్యం కడిగిన నీటిని (Rice Water) పనికిరానివిగా భావించి పారబోస్తుంటారు. కానీ ఈ నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మం నుండి జుట్టు వరకు ఎంతో మేలు చేస్తాయి.

బియ్యం కడిగిన నీటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి:

  • మొక్కలకు ఎరువుగా: బియ్యం కడిగిన నీటిని మొక్కల మొదళ్లలో పోయవచ్చు. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి.
  • ఇంటిని శుభ్రం చేయడానికి: ఈ నీటిని ఒక బాటిల్‌లో పోసి అద్దాలు, గాజు వస్తువులను శుభ్రం చేయడానికి వాడవచ్చు. మరకలు ఉన్న చోట ఈ నీటిని చల్లి మెల్లగా తుడిస్తే గాజు వస్తువులు తళతళా మెరుస్తాయి.
  • పాత్రల వాసన పోగొట్టడానికి: అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటివి నిల్వ ఉంచిన డబ్బాలను కడిగినా వాసన పోదు. అలాంటి పాత్రల్లో బియ్యం కడిగిన నీటిని పోసి కాసేపు ఉంచి కడిగితే వాసన పూర్తిగా పోతుంది. జిడ్డు కూడా సులభంగా వదులుతుంది.
  • బట్టల స్టిఫ్నెస్ కోసం: బియ్యం నీటిలో సహజమైన గంజి (Starch) ఉంటుంది. కాటన్ బట్టలను శుభ్రం చేయడానికి దీనిని వాడవచ్చు.
  • చర్మ సౌందర్యానికి: ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై రంధ్రాలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
  • జుట్టు ఆరోగ్యానికి: ఈ నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకల చివర్లు చిట్లడం తగ్గి, జుట్టు వేగంగా పెరుగుతుంది.

Posted

in

by

Tags: