కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కం ప్రాంతంలో ఒక 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని 22 ఏళ్ల ముహమ్మద్ మిథిలాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆ చిన్నారి అంగన్‌వాడీలో తన టీచర్‌కు తన బాధను చెప్పడంతో ఈ దారుణం బయటపడింది.
ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పిగా ఉందని చెప్పడంతో… అందిన సమాచారం ప్రకారం, నిందితుడు మిథిలాజ్ తన స్నేహితుడి ఇంటికి తరచుగా వెళ్తూ ఉండేవాడు. అయితే తన స్నేహితుడి చెల్లిపైనే అతను ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగడతాడని ఆ కుటుంబం ఊహించలేదు. ఒకరోజు ఆ చిన్నారి అంగన్‌వాడీకి వెళ్ళినప్పుడు, తనకు ప్రైవేట్ పార్ట్స్‌లో విపరీతమైన నొప్పి వస్తోందని తన టీచర్‌కు చెప్పింది. అనుమానం వచ్చిన టీచర్ ఆ పాపను ప్రేమగా విచారించగా, జరిగిన దారుణం బయటపడింది.
“పెద్దన్నయ్యే ఇలా చేశాడు…” తమ ఇంటికి తరచుగా వచ్చే ఆ ‘పెద్దన్నయ్యే’ (తన అన్నయ్య స్నేహితుడు) తనపై ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ చిన్నారి వివరించింది. వెంటనే అంగన్‌వాడీ టీచర్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు మిథిలాజ్‌ను వాయనాడ్‌లో అరెస్టు చేశారు.
