అలెర్ట్: మొబైల్‌లో ‘అశ్లీల’ వీడియోలు చూస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి సమాచారం వేలిముద్రల మీద అందుబాటులో ఉంది. మన దేశంలో అడల్ట్ కంటెంట్‌పై నిషేధం ఉన్నప్పటికీ, చాలామంది రహస్యంగా ఇంటర్నెట్‌లో ఇటువంటి వీడియోలను చూస్తుంటారు. తాము ‘ప్రైవేట్ మోడ్’ లేదా ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ (Incognito Mode) లో చూస్తున్నాం కాబట్టి ఎవరికీ తెలియదని భ్రమపడుతుంటారు. కానీ, అది మీ భద్రతకు ఎంత ప్రమాదకరమో ఈ వివరాలు చదివి తెలుసుకోండి:

మీరు ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నప్పుడు వేల సంఖ్యలో AI బాట్‌లు (AI Bots) మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. మీ గోప్యతకు పొంచి ఉన్న ముప్పులు ఇవే:

  1. అప్లికేషన్‌ల నిఘా:
    మీరు మొబైల్‌లో ఇటువంటి వీడియోలను చూసినప్పుడు, మీ మొబైల్ సర్వీస్ ఆపరేటర్ దగ్గర ఆ సమాచారం ఉంటుంది. అంతేకాకుండా, మీ ఫోన్‌లో ఉన్న కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్‌లు గూఢచారి సంస్థల వలె మీ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేస్తాయి. మీరు ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు అనే పూర్తి వివరాలు వాటికి తెలిసిపోతాయి.
  2. సోషల్ మీడియా మరియు ప్రకటనల ఉచ్చు:
    మీ బ్రౌజింగ్ అలవాట్లను బట్టి మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు సంబంధించిన ప్రకటనలు (Ads) చూపించబడతాయి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి కంటెంట్‌కు బానిసలయ్యారని గుర్తిస్తే, వారికి అవే ప్రకటనలు కనిపిస్తాయి. దీనివల్ల మీ వ్యక్తిగత అభిరుచులు ఇతరులకు తెలిసిపోయే ప్రమాదం ఉంది.
  3. ఆర్థిక మోసాలు:
    డబ్బు చెల్లించి (Paid Services) ఇటువంటి వీడియోలను చూసేవారు సైబర్ నేరగాళ్ల మొదటి టార్గెట్. మీరు పేమెంట్ చేసే సమయంలో మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు సేకరించి, మీ ఖాతాలోని డబ్బును కాజేసే అవకాశం ఉంది.
  4. మాల్వేర్ మరియు బ్లాక్‌మెయిలింగ్:
    అడల్ట్ వెబ్‌సైట్‌ల ద్వారా మీ ఫోన్‌లోకి మాల్వేర్ (Malware) లేదా వైరస్‌లు ప్రవేశించే ప్రమాదం చాలా ఎక్కువ. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి, మీ ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉన్నాయి.

Posted

in

by

Tags: