వెండి ధరలు: నిజమైన రాబర్ట్ కియోసాకి అంచనా – చైనా ప్రమాదకరమైన ఎత్తుగడను బయటపెట్టిన ఇన్వెస్టర్!

బంగారం-వెండి ధరలు: ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ధరలు తగ్గుతాయని కస్టమర్లు వేచి చూస్తుంటే.. జ్యువెలర్లు కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ధరలు మాత్రం తగ్గకుండా అందరికీ షాక్ ఇస్తున్నాయి.

సామాన్యులు ఈ పెరుగుదలను ఊహించలేకపోయినా, ఒక వ్యక్తి మాత్రం దీనిని ముందే పసిగట్టారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఈ ఏడాది వెండి ధర 3 లక్షల రూపాయల మార్కును దాటుతుందని ముందే అంచనా వేశారు. ఆయన మాట విని వెండిలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు లాభాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రపంచానికి మరో కొత్త హెచ్చరిక జారీ చేశారు.

వెండిపై చైనా భయంకరమైన ప్లాన్

రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చైనా ముందే పసిగట్టింది. వెండి మార్కెట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చైనా భారీగా వెండిని నిల్వ చేస్తోంది. చైనాకు పాశ్చాత్య దేశాల స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల మీద గానీ, వారి కరెన్సీ (డాలర్) మీద గానీ నమ్మకం లేదు. అందుకే వెండి నిల్వలను పెంచుకోవడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా తగ్గుతున్న సమయంలోనే చైనా తన స్టాక్ పెంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం దేశాల మధ్య ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం) పెరుగుతోంది. ఇలాంటి సమయంలో డాలర్‌కు మరియు అమెరికాకు వ్యతిరేకంగా తనను తాను శక్తివంతంగా మార్చుకోవడమే చైనా లక్ష్యమని కియోసాకి విశ్లేషించారు


Posted

in

by

Tags: