ఫ్రిజ్ పైన వస్తువులు పెడుతున్నారా? ఇంట్లోని సంపద హరించుకుపోతుంది!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ (శీతలీకరణ యంత్రం) ఉంటోంది. అయితే, ఫ్రిజ్‌కు మరియు వాస్తుశాస్త్రానికి మధ్య సంబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు.

వాస్తు ప్రకారం ఫ్రిజ్ ఎక్కడ ఉండాలి? వాస్తు ప్రకారం ఫ్రిజ్‌ను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వంటగదిలోని నైరుతి (South-West) మూలలో ఉంచడం అత్యంత శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఒకవేళ అక్కడ వీలు కాకపోతే పశ్చిమ లేదా ఉత్తర దిశలలో కూడా ఉంచవచ్చు. దీనివల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని నమ్ముతారు. అయితే, ఈశాన్యం (North-East) మూలలో మాత్రం ఎప్పుడూ ఫ్రిజ్‌ను ఉంచకూడదు.

ఫ్రిజ్ పైన వస్తువులు ఉంచడం వల్ల కలిగే నష్టాలు: చాలామంది ఫ్రిజ్ పైన రకరకాల వస్తువులను అడుకుతుంటారు. వినడానికి ఇది చిన్న విషయంగా అనిపించినా, దీనివల్ల ఇంట్లోని శక్తి ప్రవాహం దెబ్బతింటుందని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని వాస్తు చెబుతోంది.

  • పాజిటివ్ ఎనర్జీ: ఫ్రిజ్ విద్యుత్తుతో నడుస్తుంది కాబట్టి దాని పైన బరువైన లేదా అనవసరమైన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి నశిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది.
  • మందులు: కొంతమంది ఫ్రిజ్ పైన మందులను ఉంచుతారు. ఫ్రిజ్ నుండి వెలువడే వేడి మందుల నాణ్యతను తగ్గిస్తుంది. ఇలాంటి మందులు వాడటం వల్ల రోగాలు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుందని నమ్ముతారు.

Posted

in

by

Tags: