చేతిలో పెన్సిల్ ఉండాల్సిన వయసులో బేడీలు: స్కూల్ నుండి వస్తున్న 5 ఏళ్ల చిన్నారిని తీసుకెళ్లిన ఏజెంట్లు; ట్రంప్ నిర్ణయంతో కన్నీళ్లు పెట్టించే దృశ్యం

ఇమ్మిగ్రేషన్ రైడ్స్: దీనిని చట్టం అనాలా లేక మానవత్వం మంటగలిసిందనాలా? అమెరికాలో తన తండ్రితో కలిసి స్కూల్ నుండి ఇంటికి వస్తున్న ఒక 5 ఏళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు చుట్టుముట్టి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

ఇటీవలి వారాల్లో మిన్నియాపోలిస్ ప్రాంతంలో అధికారుల అదుపులోకి వెళ్లిన నాలుగో విద్యార్థి ఇతడు. అసలు ఏం జరిగిందంటే..

కారులో వెళ్తుండగానే అదుపులోకి..

కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఫెడరల్ ఏజెంట్లు లియామ్ కోనెజో రామోస్ అనే బాలుడిని తన ఇంటి ఆవరణలోనే అదుపులోకి తీసుకున్నారు. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారో తెలుసుకోవడానికి, ఆ ఐదేళ్ల బాలుడిని ఒక ‘రర ఎర’గా వాడుకుని తలుపు తట్టమని అధికారులు చెప్పడం గమనార్హం.

అధికారుల వెర్షన్ ఏమిటి?

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ మాట్లాడుతూ.. తాము బాలుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. బాలుడి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్, ఈక్వెడార్ నుండి వచ్చి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఆయన తన బిడ్డను వదిలేసి పారిపోయాడని ఆమె పేర్కొన్నారు. బాలుడి భద్రత కోసమే ఒక అధికారి అతనితో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.

మానవత్వంపై ప్రశ్నలు

కుటుంబ న్యాయవాది మార్క్ ప్రోకోష్ మాట్లాడుతూ.. సదరు కుటుంబం 2024లో అమెరికాకు వచ్చిందని, వారి ఆశ్రయం (Asylum) కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు. వారు అన్ని నియమాలను పాటిస్తున్నప్పటికీ, ఐదేళ్ల పిల్లాడిని నేరస్థుడిలా డిటెన్షన్ సెంటర్‌లో ఉంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లియామ్ మరియు అతని తండ్రిని టెక్సాస్‌లోని ఇమ్మిగ్రేషన్ లాకప్‌కు తరలించారు.


Posted

in

by

Tags: