పాకిస్థాన్ వింత రన్ ఛేజ్: స్కాట్లాండ్‌ను టోర్నీ నుండి తప్పించేందుకే ఈ డ్రామా!

అండర్-19 వరల్డ్ కప్: జింబాబ్వేను ఓడించి పాకిస్థాన్ అండర్-19 జట్టు సూపర్-6 దశకు చేరుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ 26.2 ఓవర్లలో 8 వికెట్లు ఉండగానే ఛేదించింది.

సాధారణంగా చూస్తే ఈ విజయం మామూలుగానే అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక పెద్ద మతలబు ఉంది. జింబాబ్వేను తదుపరి రౌండ్‌కు పంపి, స్కాట్లాండ్‌ను టోర్నీ నుంచి పంపించేందుకే పాకిస్థాన్ ఈ నాటకానికి తెరలేపింది. గ్రూప్-సి నుండి మూడు జట్లు క్వాలిఫై అవ్వాల్సి ఉండగా.. పాకిస్థాన్, ఇంగ్లాండ్ అప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మూడవ స్థానం కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య పోటీ నెలకొంది.

పాకిస్థాన్ వ్యూహం ఏమిటి?

పాకిస్థాన్ గనుక ఈ లక్ష్యాన్ని 25.2 ఓవర్లలో (కేవలం ఒక ఓవర్ ముందు) పూర్తి చేసి ఉంటే, నెట్ రన్‌రేట్ ఆధారంగా స్కాట్లాండ్ సూపర్-6 కు వెళ్లేది, జింబాబ్వే బయటకు వచ్చేది. కానీ పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకు సహాయం చేసింది.

  • 14 ఓవర్లకు పాకిస్థాన్ స్కోరు 84/2. విజయానికి 44 పరుగులు మాత్రమే కావాలి.
  • క్రీజులో సెట్ బ్యాటర్ షామీర్ మన్హాస్ ఉన్నప్పటికీ, ఈ 44 పరుగులు చేయడానికి పాకిస్థాన్ ఏకంగా 74 బంతులు తీసుకుంది.
  • సరిగ్గా 26 ఓవర్లు ముగిశాక, అంటే స్కాట్లాండ్ టోర్నీ నుండి నిష్క్రమించిందని కన్ఫర్మ్ అయిన వెంటనే, మన్హాస్ వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్ ముగించాడు.
దీనివల్ల పాకిస్థాన్‌కు కలిగిన లాభం ఏమిటి?

జింబాబ్వేను ముందుకు తీసుకెళ్లడం పాకిస్థాన్‌కు కూడా లాభదాయకం. నిబంధనల ప్రకారం, గ్రూప్ స్టేజ్ నుండి క్వాలిఫై అయిన జట్లు ఒకదానితో ఒకటి ఆడిన మ్యాచ్‌ల పాయింట్లు మరియు రన్‌రేట్ మాత్రమే సూపర్-6 కు తీసుకువెళ్తారు.

  • స్కాట్లాండ్‌పై పాకిస్థాన్ 41 బంతులు మిగిలి ఉండగా గెలిచింది.
  • కానీ జింబాబ్వేపై ఏకంగా 142 బంతులు మిగిలి ఉండగా గెలిచింది. ఒకవేళ జింబాబ్వే క్వాలిఫై అయితే, పాకిస్థాన్ తన ఖాతాలో మెరుగైన నెట్ రన్‌రేట్‌ను (జింబాబ్వేపై సాధించిన భారీ విజయాన్ని) సూపర్-6 దశకు తీసుకెళ్లవచ్చు. అందుకే స్కాట్లాండ్‌ కంటే జింబాబ్వే క్వాలిఫై అవ్వడమే పాకిస్థాన్‌కు మేలు చేసింది.

Posted

in

by

Tags: