వామ్మో.. ఘోరం! భర్త శవంతో 4 ఏళ్లుగా కాపురం.. పిల్లలను బెదిరించి భార్య చేసిన పని వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది!

రష్యాలోని లెనిన్ గ్రాడ్ ప్రాంతంలో వెలుగు చూసిన ఒక భయంకరమైన ఘటన ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. చనిపోయిన భర్త మృతదేహంతో ఒక మహిళ ఏకంగా నాలుగు ఏళ్లుగా కాపురం చేస్తోంది.

అసలేం జరిగింది? 49 ఏళ్ల వ్లాదిమిర్ అనే వ్యక్తి 2020లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, అతని భార్య స్వెత్లానా ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టింది. భర్త శరీరాన్ని ఒక ‘మమ్మీ’లా మార్చి, తన పడకగదిలోనే ఉంచుకుంది. “ఈ నిజాన్ని ఎవరికైనా చెబితే మిమ్మల్ని అనాథాశ్రమంలో పడేస్తాను” అని తన నలుగురు పిల్లలను బెదిరించి, నాలుగేళ్లుగా ఈ రహస్యాన్ని బయటపడకుండా మేనేజ్ చేసింది.

వింత ఆచారాలు – మాంత్రిక పూజలు: తన భర్త మళ్లీ బతుకుతాడనే మూఢనమ్మకంతో ఆమె ఇంట్లో వింత వింత ఆచారాలు పాటించేది. ఈజిప్షియన్ దేవుడు ‘అనుబిస్’ విగ్రహాన్ని, పుర్రెలను ఉపయోగించి శవం వద్ద మాంత్రిక పూజలు చేసేదని సమాచారం.

వెలుగులోకి వచ్చిందిలా.. గత నాలుగేళ్లుగా సామాజిక కార్యకర్తలు పలుమార్లు ఆ ఇంటికి వెళ్లినప్పటికీ, ఈ విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. అయితే, ఇటీవల వారు జరిపిన ఆకస్మిక మరియు ముమ్మర తనిఖీల్లో ఈ భయంకరమైన మర్మం బయటపడింది. ప్రస్తుతం ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని మానసిక పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కళ్ల ముందే తండ్రి శవాన్ని చూస్తూ గడిపిన ఆ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.


Posted

in

by

Tags: