చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉంటారు, కానీ అన్నింటినీ ఉపయోగించరు. ఖాతాలో కనీస నిల్వ (Minimum Balance) లేకపోతే జరిమానాలు పడటం, ఏటీఎం మరియు ఇతర సేవా రుసుములు భారమవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించని ఖాతాలను మూసివేయడం ఉత్తమం.
ఖాతాను మూసివేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- నగదు బదిలీ: ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను ముందుగా వేరే ఖాతాలోకి బదిలీ చేసుకోండి లేదా విత్‌డ్రా చేసుకోండి.
- స్టేట్మెంట్ డౌన్లోడ్: గత 2 నుండి 3 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఆదాయపు పన్ను (IT) రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి.
- బకాయిల చెల్లింపు: ఏవైనా సర్వీస్ ఛార్జీలు లేదా నెగటివ్ బ్యాలెన్స్ ఉంటే వాటిని చెల్లించండి. బకాయిలు ఉంటే బ్యాంక్ ఖాతాను మూసివేయదు.
- ఆటో-డెబిట్ రద్దు: సబ్స్క్రిప్షన్లు లేదా ఈఎంఐల కోసం ఆటో-డెబిట్ ఆప్షన్ ఉంటే దానిని ముందుగానే రద్దు చేయండి.
- క్లోజర్ ఛార్జీలు: ఖాతా తెరిచిన ఏడాది లోపే మూసివేస్తే బ్యాంకులు కొంత రుసుము వసూలు చేసే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్లో ఖాతాను మూసివేసే విధానం:
- బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
- Account Services లేదా Service Requests ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Close Bank Account పై క్లిక్ చేసి, ఖాతాను మూసివేయడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఫారమ్ నింపండి.
- అవసరమైన గుర్తింపు కార్డులను అప్లోడ్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా అభ్యర్థనను ధృవీకరించండి.
- అభ్యర్థన విజయవంతం అయిన తర్వాత, బ్యాంక్ దానిని పరిశీలించి కొన్ని రోజుల్లో ఖాతాను మూసివేస్తుంది. అప్పటివరకు వేచి ఉండాలి.
