పరిణామ జీవశాస్త్రవేత్తల ప్రకారం, మానవ పురుషాంగం పరిమాణం వెనుక కేవలం సంతానోత్పత్తి (Reproduction) మాత్రమే కాకుండా, మరో రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని కొత్త అధ్యయనం చెబుతోంది.
1. భాగస్వామిని ఆకర్షించడం:
మనుషులు దుస్తులు ధరించడం ప్రారంభించకముందే నిటారుగా నడవడం నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఎత్తుగా ఉండటం, ‘V’ ఆకృతిలో శరీరం ఉండటంతో పాటు పురుషాంగం పరిమాణం కూడా ఆడవారిని ఆకర్షించడంలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది.
- బయోలాజికల్ సిగ్నల్: ఆదిమ కాలంలో పెద్ద పరిమాణం అనేది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు శక్తిని సూచించే సంకేతంగా పనిచేసేదని పరిశోధకులు భావిస్తున్నారు. 800 మందిపై చేసిన సర్వేలో, ఎత్తు మరియు మంచి శరీర సౌష్టవంతో పాటు సరైన పరిమాణం కలిగిన పురుషుల పట్ల మహిళలు ఆకర్షితులవుతున్నట్లు తేలింది. అయితే ఒక పరిమితి దాటిన తర్వాత పరిమాణం పెరిగినా ఆకర్షణలో పెద్ద మార్పు లేదని గమనించారు.
2. ప్రత్యర్థులను భయపెట్టడం:
పురుషుల దృక్కోణంలో ఈ పరిమాణం ఒక ‘ముప్పు’ (Threat) గా కనిపిస్తుంది. తమ కంటే పెద్ద అవయవం ఉన్న పురుషుడిని చూసినప్పుడు, అతను తమ కంటే బలవంతుడని లేదా ఆడవారిని ఎక్కువగా ఆకర్షించగలడని ఇతర పురుషులు భావిస్తారు. అంటే, ఇది ప్రత్యర్థులను మానసికంగ భయపెట్టడానికి కూడా ఉపయోగపడిందని అధ్యయనం పేర్కొంది.
ప్రధాన లక్ష్యం ఏమిటి?
శత్రువులను భయపెట్టడం కంటే, భాగస్వామిని ఆకర్షించడానికే ఈ పరిమాణం 4 నుండి 7 రెట్లు ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంటే, పరిణామక్రమంలో ఆడవారి ఆసక్తిని బట్టే ఈ అవయవం అభివృద్ధి చెంది ఉండవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.
జంతువులతో పోలిక:
గొరిల్లా వంటి భారీ జంతువుల పురుషాంగం కేవలం 3 సెంటీమీటర్లు (1.2 అంగుళాలు) మాత్రమే ఉంటుంది. ఇతర కోతి జాతులలో అవయవం పరిమాణం కంటే వీర్యం పరిమాణానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ మానవులలో ఇది ఒక ‘సౌందర్య లక్షణం’ (Aesthetic trait) లాగా కూడా పనిచేస్తుంది.
