పదేళ్లు అన్నం, చపాతీ మానేస్తే ఆరోగ్యంలో వచ్చిన మార్పులేంటి? 34 ఏళ్ల యువతి అనుభవం

నేటి కాలంలో చాలా మంది డైటీషియన్లు అన్నం మరియు చపాతీలను పూర్తిగా మానేయమని సలహా ఇస్తున్నారు. ఆకృతి గోయల్ అనే 34 ఏళ్ల మహిళ, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక స్టార్టప్‌లో లీడ్‌గా పనిచేశారు. ఆకృతి నీట్ (NEET) పరీక్షలో 1,118వ ర్యాంక్ సాధించి, ప్రస్తుతం హిందూ రావు మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ నిపుణురాలైన ఆమె, డిసెంబర్ 31న ఒక ఇన్‌స్టా పోస్ట్‌లో గత పదేళ్లుగా అన్నం, చపాతీ మానేయడం వల్ల తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి వివరించారు.

నేను అన్నం లేదా చపాతీ తినను తన కుటుంబంలో మధుమేహం (డయాబెటిస్) చరిత్ర ఉందని, అందుకే సంప్రదాయ ఆహారమైన రొట్టె, అన్నం మానేశానని ఆమె తెలిపారు. వీటిలో ‘హై గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్లు’ ఎక్కువగా ఉంటాయని, వీటికి బదులుగా ప్రోటీన్ కోసం ‘పెసరట్టు’ (ముంగ్ దాల్ చిల్లా) తీసుకోవడం వల్ల తనలో శక్తి స్థాయిలు పెరగడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడిందని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఒక ఉప్పెనలా వస్తున్నాయని, యువత తీసుకునే తప్పుడు ఆహారమే దీనికి కారణమని ఆమె అన్నారు. పదేళ్లుగా వీటిని మానేయడం వల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని, 20 ఏళ్ల అమ్మాయికి ఉండేంత శక్తి తనలో ఉందని ఆమె చెప్పారు.

‘నాకు డయాబెటిస్ రాకూడదని ఈ నిర్ణయం’ “గత 10 ఏళ్లుగా నా రోజువారీ భోజనంలో చపాతీ లేదా అన్నం అస్సలు లేదు. చాలా అరుదుగా ఎప్పుడైనా తింటే తినవచ్చు. నేను ఇంట్లో పిండి కానీ, బియ్యం కానీ నిల్వ ఉంచుకోను. గత రెండేళ్లుగా కూరలతో పాటు చపాతీకి బదులు కేవలం పెసరట్టు మాత్రమే తింటున్నాను. వారానికి ఐదు రోజులు వెయిట్ ట్రైనింగ్ చేస్తాను,” అని ఆకృతి వీడియోలో వివరించారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. “నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. నా MBBS బ్యాచ్‌లోని 20 ఏళ్ల యువకుల కంటే నాలో ఎక్కువ ఎనర్జీ ఉంది. పదేళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను. అన్నం, రొట్టె తినకపోవడం వల్ల నాలో ఎలాంటి నీరసం లేదు. మా కుటుంబం మొత్తానికి డయాబెటిస్ ఉంది, నాకు అది రాకూడదనే ఈ మార్పు చేసుకున్నాను,” అని తెలిపారు.


Posted

in

by

Tags: