న్యూఢిల్లీ: బస్సులో నిలబడటానికి కూడా చోటు లేని స్థితిలో ఉన్న ఒక యువకుడిని, ఓ మహిళ అనవసరంగా గొడవకు లాగిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
ఢిల్లీ ప్రభుత్వ బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. కనీసం కాలు పెట్టేందుకు కూడా సందు లేని ఆ బస్సులో, నీలిరంగు చొక్కా ధరించిన ఒక యువకుడు సీటు పక్కన మౌనంగా నిలబడి ఉన్నాడు.
ఆ సీటులో పసుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ కూర్చుని ఉంది. అకస్మాత్తుగా ఆమె ఆ యువకుడిపై విరుచుకుపడింది. “నీ చెయ్యి పక్కకు పెట్టు.. ఎందుకు నన్ను తగులుతున్నావు?” అంటూ ఏకవచనంతో దుర్భాషలాడటం మొదలుపెట్టింది.
యువకుడి స్పందన:
ఆమె మాటలకు షాక్ తిన్న యువకుడు చాలా స్పష్టంగా సమాధానమిచ్చాడు. “బస్సులో అస్సలు చోటు లేదు.. నా చెయ్యి మీకు ఎంత దూరంలో ఉందో చూడండి. నేనేమీ తప్పు చేయలేదు” అని వివరించాడు.
కానీ ఆ మహిళ తగ్గలేదు. “నీకు సిగ్గు లేదా? ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నావు” అంటూ ఏకపక్షంగా నిందలు వేయడం కొనసాగించింది.
అదిరిపోయే కౌంటర్:
దీంతో విసిగిపోయిన ఆ యువకుడు గట్టిగానే బదులిచ్చాడు:
“అవును ఆంటీ.. ఈ పురుష సమాజం మీలాంటి మహిళలను చూస్తే ఇప్పుడు భయపడుతోంది. ఎక్కడ ఏ నింద వేస్తారో అని భయమేస్తోంది” అంటూ ‘నచ్’ మనిపించేలా సమాధానమిచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్:
ఈ వీడియో @gharkekalesh అనే ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేయగా, లక్షలాది మంది వీక్షించారు. ఇది చూసిన నెటిజన్లు, “ఆ మహిళ కావాలనే ఆ యువకుడిని అవమానించాలని చూస్తోంది” అని, “యువకుడు చెప్పిన సమాధానం నూటికి నూరు పాళ్లు నిజం” అని కామెంట్స్ చేస్తున్నారు.
