ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశమైన ఇండోనేషియా, ఫ్రాన్స్ నుండి తన మొదటి రాఫెల్ యుద్ధ విమానాల డెలివరీని అందుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, మల్టీ-బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంలో భాగంగా ఇండోనేషియాకు ప్రస్తుతం మూడు రాఫెల్ యుద్ధ విమానాలు అందాయి.
ఒప్పందం వివరాలు: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇండోనేషియా తన పాత సైనిక పరికరాలను ఆధునీకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా 2021లో ఫ్రాన్స్‌తో సుమారు 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 42 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
విమానాలు ఎక్కడ ఉన్నాయి? తాజాగా అందిన మూడు రాఫెల్ విమానాలను సుమత్రా పశ్చిమ తీరంలోని పెకాన్బారులో ఉన్న రోస్మిన్ నూర్జాదిన్ ఎయిర్ బేస్‌లో ఉంచారు. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని విమానాలు అందుతాయని మిలిటరీ బ్రిగేడియర్ రికో రికార్డో సిరిట్ తెలిపారు.
సబ్ మెరైన్లు మరియు ఇతర ఒప్పందాలు: కేవలం విమానాలే కాకుండా, ఫ్రాన్స్‌కు చెందిన ‘నేవల్ గ్రూప్’ ద్వారా రెండు స్కార్పీన్ క్లాస్ (Scorpène-class) దాడి జలాంతర్గాములను కూడా ఇండోనేషియా ఆర్డర్ ఇచ్చింది. ఇవి ఇండోనేషియాలోని పిటి పాల్ (PT PAL) షిప్‌యార్డ్‌లో నిర్మించబడతాయి. వీటికి సంబంధించిన సాంకేతికతను ఫ్రాన్స్ అందిస్తుంది.
పాకిస్థాన్ మరియు టర్కీలకు ఎదురుదెబ్బ: గతంలో పాకిస్థాన్ తన జెఎఫ్-17 (JF-17) విమానాలను ఇండోనేషియాకు విక్రయించాలని ప్రయత్నించినప్పటికీ, తాజా పరిణామాలతో అది సాధ్యం కాదని తేలిపోయింది. అలాగే టర్కీతో కుదుర్చుకున్న 48 కాన్ (KAAN) ఫైటర్ జెట్ల ఒప్పందం కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడింది. అమెరికా ఇంజిన్లను విక్రయించడానికి నిరాకరించడంతో టర్కీ ఇప్పుడు యూరోఫైటర్ల వైపు మొగ్గు చూపుతోంది.
