మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో ఆయన మరణించారనే వార్త మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అసలేం జరిగింది?
ముంబై నుండి బారామతికి బయలుదేరిన Bombardier Learjet 45 (VT-SSK) రకానికి చెందిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు టేకాఫ్ అయింది. ఉదయం 8:30 గంటల సమయంలో బారామతిలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో (Poor Visibility) అది సాధ్యపడలేదు.
ఆ 4 నిమిషాల మిస్టరీ
ఉదయం 8:42 గంటలకు విమానం రెండోసారి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న సమయంలో, 8:45 గంటలకు విమానం రాడార్ నుండి మాయమైంది. ఆ తర్వాతి 4 నిమిషాల పాటు విమానం ఏమైందో ఎవరికీ తెలియలేదు. చివరకు బారామతి ఎయిర్‌పోర్ట్ రన్‌వేకు కేవలం 100 మీటర్ల దూరంలో విమానం వెస్ఫోటనం చెంది కూలిపోయినట్లు గుర్తించారు.
పైలట్లు మరియు ప్రయాణికులు
ఈ విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన భద్రతా అధికారి, సహాయకుడు సహా మొత్తం ఐదుగురు ఉన్నారు.
- ప్రధాన పైలట్: సుమిత్ కపూర్.
- కో-పైలట్: శంభవి పాఠక్. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారందరూ మరణించినట్లు సమాచారం.
విమాన వివరాలు
ఈ ‘లియర్ జెట్ 45’ విమానం ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. ఇది గంటకు 800-850 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. విమానం చాలా సురక్షితమైనదని, పైలట్లు అనుభవజ్ఞులని సంస్థ పేర్కొంది. కేవలం వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం DGCA అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
