“నువ్వు ఎవరితోనైనా వెళ్లు..” – ప్రియుడితో కలిసి లాడ్జిలో దిగిన భార్య.. భర్త ఫోన్ కాల్ తర్వాత ఊహించని విషాదం!

తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని మధురాంతక నల్లూరుకు చెందిన హరిదాస్ (26) అనే యువకుడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన కవియరసి అనే వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. కవియరసికి అప్పటికే సెల్వరాజ్ అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, హరిదాస్ మరియు కవియరసి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఘటన నేపథ్యం:

వీరిద్దరి సంబంధం గురించి తెలిసిన భర్త సెల్వరాజ్ భార్యను పలుమార్లు మందలించాడు. దీనివల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హరిదాస్.. కవియరసిని భర్తను వదిలి తనతో వచ్చేయమని, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడు. దీంతో కవియరసి తన ఇద్దరు పిల్లలను తీసుకుని భర్తకు తెలియకుండా హరిదాస్‌తో కలిసి తిరుపూర్ వెళ్లిపోయింది.

అక్కడ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం చిదంబరంలోని సభానాయకర్ వీధిలో ఉన్న ఒక లాడ్జిలో గది తీసుకుని దిగారు. కవియరసి తన ప్రియుడితో వెళ్ళిపోయిందని తెలుసుకున్న భర్త సెల్వరాజ్ ఆమెకు ఫోన్ చేసి.. “నువ్వు ఎవరితోనైనా వెళ్లు, నాకు అభ్యంతరం లేదు.. కానీ నా పిల్లలు నాకు కావాలి” అని ఖరాకండిగా చెప్పాడు. దీంతో కవియరసి తన పిల్లలను మొదటి భర్తకు అప్పగించి వస్తానని హరిదాస్‌కు చెప్పి అక్కడి నుండి వెళ్ళింది.

ఏం జరిగింది?

పిల్లలను అప్పగించి తిరిగి వచ్చిన కవియరసి గది తలుపు కొట్టగా లోపల నుండి ఎటువంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా, హరిదాస్ లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసుల ప్రాథమిక విచారణ: పిల్లలను అప్పగించడానికి వెళ్ళిన కవియరసి మళ్ళీ తిరిగి రాదేమోనన్న భయంతో, తీవ్ర మనస్తాపానికి గురై హరిదాస్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Posted

in

by

Tags: