రాగిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనత మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో రాగి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే రాగి లడ్డు రెసిపీని ఇక్కడ చూడవచ్చు.
తయారీ విధానం:
- ఒక బాణలిలో అర టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి.
- నెయ్యి వేడెక్కాక, ఒక కప్పు రాగి పిండిని వేసి చిన్న మంటపై (low flame) బాగా వేయించాలి. పిండి మంచి వాసన వచ్చే వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- అదే బాణలిలో కొద్దిగా నువ్వులు తీసుకుని, కడిగి ఆరబెట్టిన తర్వాత వేయించాలి. ఎముకల ఆరోగ్యం, రక్తహీనత నివారణ, షుగర్ మరియు కొలెస్ట్రాల్ నియంత్రణకు నువ్వులు ఎంతో మేలు చేస్తాయి.
- ఆ తర్వాత పావు కప్పు పల్లీలను కూడా దోరగా వేయించాలి.
- వేయించిన నువ్వులు, పల్లీలను పొడి చేసి రాగి పిండిలో కలపాలి. అందులో కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి మరియు బెల్లం పాకం వేసి బాగా కలపాలి.
- మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా (లడ్డులుగా) చుట్టుకోవాలి.
ఈ లడ్డులు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యల నివారణకు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం చాలా మంచిది.
