మహిళకు దొరికిన ఏళ్ల నాటి వైద్యుడి చీటీ; అందులో రాసి ఉన్న జలుబు-దగ్గు నివారణ మార్గం చూసి నెటిజన్లు ఫిదా!

సోషల్ మీడియాలో 63 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ వైరల్ అవుతోంది. ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఒక మహిళకు ఈ పాత చీటీ దొరికింది. 1962వ సంవత్సరంలో ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఒక వైద్యుడు దీనిని రాశారు. ఆ చీటీలో ఉన్న సమాచారం చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

ఈ రోజుల్లో చిన్న అనారోగ్యానికి వెళ్లినా డాక్టర్లు వేల రూపాయల మందులు రాస్తున్నారు. కానీ ఆ కాలంలో వైద్యులు ఇంటి చిట్కాలనే ఎక్కువగా సూచించేవారు. 1962 నాటి ఆ చీటీలో ఎటువంటి యాంటీబయోటిక్స్ లేదా ఖరీదైన సిరప్‌లు లేవు. కేవలం మూడు లైన్లలో చికిత్స ముగిసింది.

వైద్యుడు రాసిన మందులు:

  1. విస్కీ – 1 చెంచా
  2. నిమ్మరసం – 1 చెంచా
  3. తేనె – 1 చెంచా ఈ మూడింటినీ కలిపి ప్రతి గంటకు ఒకసారి లేదా అవసరాన్ని బట్టి తీసుకోవాలని అందులో రాసి ఉంది.

వైరల్ అయిన చిట్కా: జలుబు, దగ్గుకు అప్పట్లో డాక్టర్లు రాసిన ఈ వింత మందును చూసి ఆ మహిళ వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేవలం 24 గంటల్లోనే దీనికి 50 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “అప్పట్లో డాక్టర్లు రోగిని నయం చేసే ముందే సంతోషపెట్టేవారు” అని ఒకరు సరదాగా కామెంట్ చేయగా, “ఇదే అసలైన దేశీ మందు” అని మరొకరు రాశారు.

నిజానికి ఈ చిట్కాను విదేశాల్లో “హాట్ టాడీ” (Hot Toddy) అని పిలుస్తారు. విస్కీ గొంతు నొప్పిని తగ్గించడానికి, తేనె దగ్గును అదుపు చేయడానికి, మరియు నిమ్మరసం విటమిన్-సి అందించడానికి సహాయపడతాయని అక్కడ నమ్ముతారు.


Posted

in

by

Tags: