రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుండి మీ జేబుపై మరియు బ్యాంక్ ఖాతాలపై నేరుగా ప్రభావం చూపబోయే 7 కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం:
- కేంద్ర బడ్జెట్ 2026 సమర్పణ
రేపు ఆదివారం అయినప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్నులో ఏమైనా ఉపశమనం లభిస్తుందా? బంగారం మరియు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయా? వంటి కీలక ప్రకటనలు ఇందులో వెలువడనున్నాయి. - నిష్క్రియ బ్యాంక్ ఖాతాల స్తంభన
రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త నిబంధనల ప్రకారం, 6 నెలల నుండి ఏడాది వరకు ఎటువంటి లావాదేవీలు జరపని ‘జీరో బ్యాలెన్స్’ మరియు ఇన్-యాక్టివ్ ఖాతాలు రేపటి నుండి ముactive అయ్యే అవకాశం ఉంది. మీ ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే, ఈరోజే ఏదైనా చిన్న లావాదేవీ (డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్) చేయడం మంచిది. - ఫాస్టాగ్ (FASTag) కొత్త నిబంధనలు
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి, రేపటి నుండి కారు, జీపు మరియు వ్యాన్లకు ఇచ్చే కొత్త ఫాస్టాగ్‌లకు KYC అవసరం లేదని NHAI ప్రకటించింది. వాహన వివరాలు నేరుగా ‘వాహన్’ (VAHAN) వెబ్సైట్ ద్వారా సరిచూడబడతాయి, దీనివల్ల ఫాస్టాగ్ పొందడం సులభతరమవుతుంది. - బంధన్ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ మార్పు
బంధన్ బ్యాంక్ తన ఖాతాదారులకు ఊరటనిస్తూ, సేవింగ్స్ ఖాతాలో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్‌ను ₹5,000 నుండి ₹2,000 కు తగ్గించింది. రేపటి నుండి మీ ఖాతాలో ₹2,000 ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే 0.3% పెనాల్టీ విధిస్తారు. - పాన్ – ఆధార్ లింక్ తప్పనిసరి
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడానికి గడువు ఈరోజో (జనవరి 31) ముగియనుంది. ఈరోజు లోపు లింక్ చేయని పాన్ కార్డులు రేపటి నుండి పని చేయవు (Inoperative). దీనివల్ల బ్యాంక్ లావాదేవీలు మరియు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. - గ్యాస్ సిలిండర్ ధరల మార్పు
ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ ధరలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో, రేపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ మరియు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. - ఫిబ్రవరి బ్యాంక్ సెలవులు
RBI క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి 2026లో ఆదివారాలు మరియు పండగలతో కలిపి మొత్తం 9 రోజులు బ్యాంకులకు సెలవు ఉంటుంది. రేపు ఆదివారం మరియు తైపూసం పండగ సందర్భంగా తమిళనాడు వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
