రక్త ప్రసరణలో అంతరాయం: మెదడుకు వెళ్లే రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు మెదడులో ‘స్ట్రోక్’ సంభవిస్తుంది. దీనివల్ల మెదడులోని ఏదో ఒక భాగం దెబ్బతిని, అక్కడి నుండి శరీరానికి అందాల్సిన సంకేతాలు అందవు. ఫలితంగా అకస్మాత్తుగా చేతులు, కాళ్లు పడిపోవచ్చు. దీనికి పెద్దగా ముందస్తు హెచ్చరికలు లేకపోయినా.. అకస్మాత్తుగా తడబడటం, చేతులు లేదా కాళ్లు తిమ్మిర్లు పట్టడం, స్పర్శ కోల్పోవడం వంటివి చాలా మందిలో కనిపిస్తాయి. దీనివల్ల అవయవాలు పనిచేయకపోవడాన్నే పక్షవాతం అంటారు.
కారణాలు:
- వెన్నెముక దెబ్బతినడం: వెన్నెముకను ‘రెండవ మెదడు’ అని అంటారు. వెన్నెముకకు గాయమైనా లేదా ప్రమాదానికి గురైనా శరీర కదలికలు ఆగిపోవచ్చు. దీనివల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
- నరాల వ్యవస్థ సమస్యలు: శరీరంలో అత్యంత సంక్లిష్టమైనది నరాల వ్యవస్థ. ఇది దెబ్బతిన్నప్పుడు శరీరంలోని అనేక అవయవాలు బలహీనపడతాయి. కొన్నిసార్లు ‘ఆటో ఇమ్యూన్’ లోపాల వల్ల కూడా నరాల బలహీనత ఏర్పడి పక్షవాతానికి దారి తీయవచ్చు.
- ఇన్ఫెక్షన్లు మరియు కణితులు: కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు శరీర అవయవాలను నిర్వీర్యం చేయగలవు. అలాగే మెదడులో గడ్డలు లేదా కణితులు (సాధారణ గడ్డలు లేదా క్యాన్సర్ కణితులు) ఏర్పడి మెదడుపై ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా పక్షవాతం రావచ్చు.
- విటమిన్ B12 లోపం: పక్షవాతాన్ని నిరోధించడంలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉన్నప్పుడు నరాలపై ప్రభావం చూపి, మొదట కాళ్లు చేతులు మొద్దుబారి, తర్వాత పక్షవాతానికి దారి తీయవచ్చు.
- మానసిక ఒత్తిడి: అతిగా ఆలోచించడం, దీర్ఘకాలిక ఆందోళన మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా అకస్మాత్తుగా అవయవాలు పనిచేయకుండా చేసి పక్షవాతానికి కారణం కావచ్చు.
