“₹1500 పెట్టి టికెట్ కొన్నాము..! ఇప్పుడు అందులో నా ₹100 చెప్పులే ఉన్నాయి.” మహిళ వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు..!

వందే భారత్ రైలులో తన చంటిపాప కోసం రిజర్వ్ చేసిన సీటులో చెప్పులు ఉంచి, రైల్వే ఛార్జీల విధానాన్ని ఎగతాళి చేస్తూ ఒక మహిళా ప్రయాణికురాలు పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఆ మహిళ తన భర్త మరియు చిన్నారితో కలిసి వందే భారత్ రైలులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తన పాప కోసం సుమారు ₹1,500 చెల్లించి ప్రత్యేకంగా ఒక సీటును బుక్ చేశారు. అయితే, ప్రయాణం పొడవునా పాప తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోవడంతో ఆ సీటు ఖాళీగా ఉండిపోయింది.

ఖాళీగా ఉన్న ఆ సీటులో తన ₹100 విలువైన చెప్పులను ఉంచి వీడియో తీసిన ఆ మహిళ.. “మేము భారీ మొత్తం చెల్లించి కొన్న సీటులో నా బిడ్డ కూర్చోలేదు, కానీ ఈ ₹100 చెప్పులు మాత్రం హాయిగా ప్రయాణం చేస్తున్నాయి” అని రైల్వే ఛార్జీలను పరోక్షంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

“ప్రస్తుత రోజుల్లో రైలు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి అనడానికి ఇదొక హాస్యాస్పదమైన ఉదాహరణ” అని కొందరు మద్దతుగా కామెంట్ చేశారు. అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం.. “ఐదేళ్లలోపు పిల్లలకు సీటు బుక్ చేసుకోవడం అనేది తల్లిదండ్రుల వ్యక్తిగత ఇష్టం. సీటు బుక్ చేసి అందులో చెప్పులు పెట్టి రైల్వే శాఖను నిందించడం అనవసరమైన పని. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన చర్య” అని తీవ్రంగా ఖండించారు.

అంతేకాకుండా, ప్రయాణికులు కూర్చునే సీటుపై చెప్పులు పెట్టడం అసభ్యకరమైన చర్య అని, డబ్బు ఖర్చు పెట్టి సీటు కొన్నంత మాత్రాన ఇలా చేయడం పద్ధతి కాదని నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.


Posted

in

by

Tags: