తల్లిదండ్రులూ జాగ్రత్త..! క్షణాల్లో అతుక్కుపోయిన కళ్లు! “స్కూల్ విద్యార్థి చేసిన ఆ ఒక్క తప్పు”.. సర్జరీ వరకు వెళ్లిన ఘోరం.. భయాందోళన కలిగించే ఘటన..!!!

రాజస్థాన్: రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన 9 ఏళ్ల బాలుడు రాధేశ్యామ్, సోమవారం మధ్యాహ్నం తన ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా ఫెవిక్విక్ (Fevikwik) ద్రవం అతని కళ్లలో పడింది.

కళ్లు మండుతుండటంతో ఆ బాలుడు కళ్లను గట్టిగా నలిపాడు. దీనివల్ల ఆ రసాయనం కనురెప్పల అంతటా వ్యాపించి, కేవలం కొన్ని నిమిషాల్లోనే రెండు కళ్ల రెప్పలు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయాయి. నొప్పితో విలవిలలాడుతున్న బాలుడిని చూసిన పాఠశాల యాజమాన్యం వెంటనే కుషాల్‌ఘర్ ఆసుపత్రికి తరలించింది.

శస్త్రచికిత్స అవసరం:

పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. రసాయనం ప్రభావం ఎక్కువగా ఉండటం మరియు కనురెప్పలను విడదీయడానికి ప్రత్యేక శస్త్రచికిత్స (Surgery) అవసరం కావడంతో, మెరుగైన చికిత్స కోసం బాలుడిని ప్రస్తుతం ఉదయ్‌పూర్ ఆసుపత్రికి పంపారు.

“ఫెవిక్విక్ వంటి రసాయనాలు కళ్లలో పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను రుద్దకూడదు; అలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది” అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తన కుమారుడి కంటిచూపు ఎక్కడ దెబ్బతింటుందోనని రాధేశ్యామ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.


Posted

in

by

Tags: