“బ్రష్ చేసుకుని వచ్చి ముద్దు పెట్టుకో!” అని చెప్పినందుకు భార్యను ముక్కలుగా నరికిన భర్త.. బిడ్డ కళ్లెదుటే ఘోరం!

కేరళ, పాలక్కాడ్: “పళ్లు తోముకోకుండా బిడ్డను ముద్దు పెట్టుకోవద్దు” అని వారించిన భార్యను, భర్త కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోని మన్నార్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

అవినాష్ – దీపిక దంపతులకు ఒకటిన్నర ఏళ్ల మగబిడ్డ ఉన్నాడు. ఉదయాన్నే నిద్రలేవగానే బిడ్డను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన అవినాష్‌ను దీపిక అడ్డుకుంది. ముందు బ్రష్ చేసుకుని రావాలని ఆమె సూచించింది. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది చిలికి చిలికి గాలివానలా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన అవినాష్ తన భార్యను కత్తితో విచక్షణారహితంగా నరికాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దీపికను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రక్తంతో ఉన్న కత్తితో ఇంట్లోనే ఉన్న అవినాష్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరులో నివసించే ఈ దంపతులు రెండు నెలల క్రితమే కేరళకు మారారు. అవినాష్ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక చిన్న సలహా ప్రాణాలను తీసే స్థాయికి వెళ్లడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.


Posted

in

by

Tags: