15 ఏళ్లకే ప్రేమ, 17 ఏళ్లకే గర్భం! దారితప్పుతున్న నేటితరం యువత!

తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా కరంబక్కుడి సమీపంలో 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన 18 ఏళ్ల యువకుడిని పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే? పుదుక్కోట్టై జిల్లా కరంబక్కుడి సమీపంలోని పులిమంజోలై ప్రాంతానికి చెందిన తౌఫిక్ (18) మరియు అదే ప్రాంతానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలిక గత ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తౌఫిక్ ఆ బాలికను గర్భవతిని చేశాడు. విషయం ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని భయపడిన తౌఫిక్, ఆ బాలికను తీసుకుని తిరుపూర్‌కు పారిపోయాడు.

తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు జనవరి 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ మైనర్ బాలిక తిరుపూర్‌లో తౌఫిక్‌తో కలిసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించి, ఆమెను గర్భవతిని చేసినందుకు తౌఫిక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పుదుక్కోట్టై మహిళా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: