టీ20 ప్రపంచకప్ 2026లో ఆదివారం జరిగిన 5వ మ్యాచ్‌లో ఉత్కంఠభరిత పోరు సాగింది. చివరి బంతి వరకు విజయం ఎటువైపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చివరకు ఇంగ్లండ్ 4 పరుగుల స్వల్ప తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, జాకబ్ బెథెల్ (55), హ్యారీ బ్రూక్ (53)ల మెరుపు అర్ధశతకాలతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నేపాల్ 180 పరుగుల వరకు చేరుకోగలిగింది. లోకేష్ బమ్ చివరి వరకు పోరాడి 20 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో నేపాల్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, సామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తమ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ, తాము ఇక్కడ కేవలం నామమాత్రంగా పాల్గొనడానికి రాలేదని తేల్చి చెప్పారు.
మా ఆటగాళ్లను చూస్తే గర్వంగా ఉంది ఓటమి అనంతరం రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ.. “మా అబ్బాయిలు తమ శక్తినంతా ధారపోశారు. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మేము ఈ ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టినప్పుడే పూర్తి నమ్మకంతో వచ్చాం. కేవలం ఆడి వెళ్లడానికి రాలేదు. ఫలితం మాకు అనుకూలంగా రాకపోయినా, ప్రతి విభాగంలో 100% శ్రమించాం” అని అన్నారు.
సామ్ కరన్‌పై ప్రశంసలు చివరి ఓవర్లో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని రోహిత్ కొనియాడారు. లోపాలను సరిదిద్దుకుంటామని, ఏ జట్టును తక్కువ అంచనా వేయబోమని పేర్కొన్నారు. అభిమానుల మద్దతు గురించి చెబుతూ.. “కాఠ్మండు నుంచి నేపాల్ వరకు మా అభిమానులు ఎంతో ఉత్సాహంగా మద్దతు ఇస్తున్నారు. నేపాల్ దేశం మొత్తం మమ్మల్ని చూసి గర్విస్తుంది” అని భావోద్వేగంగా చెప్పారు. ఫిబ్రవరి 12న ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీతో తలపడనుంది.
