ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం ‘జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్’. ఈ పత్రాల ప్రకారం, ఎప్స్టీన్ మైనర్ బాలికలను, యువతులను అపహరించి సంపన్నులకు సరఫరా చేసేవాడని తెలుస్తోంది. దీనికోసం అతను ఒక ప్రత్యేక ద్వీపాన్నే నిర్వహించేవాడు. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు బయటకు వస్తున్న ఈ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఎలోన్ మస్క్, ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం.
‘సూపర్ రేస్’ సృష్టించాలనే కుట్ర న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఎప్స్టీన్ ఒక సరికొత్త మానవ జాతిని (Super Race) సృష్టించాలని ప్లాన్ చేశాడు. న్యూ మెక్సికోలోని తన 10,000 ఎకరాల ఎస్టేట్లో ఒకేసారి 20 మంది మహిళలను ఎంపిక చేసి, తన వీర్యం ద్వారా వారిని గర్భవతులను చేయాలని భావించాడు.
హిట్లర్ అనుసరించిన ‘యూజెనిక్స్’ సిద్ధాంతం అతను తన జన్యువులను ఉపయోగించి, గర్భస్థ దశలోనే అసాధారణ తెలివితేటలు, శక్తులు కలిగిన పిల్లలను పుట్టించాలని అనుకున్నాడు. దీనినే ‘యూజెనిక్స్’ సిద్ధాంతం అంటారు. గతంలో 20వ శతాబ్దంలో హిట్లర్ నేతృత్వంలోని నాజీలు కూడా ‘శుద్ధ ఆర్య జాతి’ని సృష్టించడానికి ఇదే సిద్ధాంతాన్ని అనుసరించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించి ఎప్స్టీన్ కూడా అదే బాటలో నడవాలని ప్రయత్నించాడు.
తన ఆలోచనలకు శాస్త్రీయ గుర్తింపు తెచ్చుకోవడానికి స్టీఫెన్ హాకింగ్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలను తన ద్వీపానికి ఆహ్వానించి విందులు ఇచ్చేవాడని సమాచారం. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలకు మిలియన్ల డాలర్ల విరాళాలు ఇచ్చాడు. తన మరణం తర్వాత తన శరీరాన్ని, ముఖ్యంగా మెదడు మరియు జననేంద్రియాలను గడ్డకట్టిన స్థితిలో (Cryonics) భద్రపరచాలని, భవిష్యత్ సాంకేతికతతో తాను మళ్ళీ ప్రాణం పోసుకోవచ్చని అతను నమ్మాడు.
