ఒక వ్యక్తి అందాన్ని పెంచడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం జుట్టు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే జుట్టు సమస్యలకు అత్యుత్తమ మరియు సహజమైన పరిష్కారం కొన్ని రకాల గింజలు. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు (Hair Growth) ఎంతగానో తోడ్పడతాయి. అవిసె గింజలు, చియా గింజలు మరియు గుమ్మడి గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనివ్వడమే కాకుండా తల చర్మాన్ని (Scalp) ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్త ప్రసరణను పెంచి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
1. గుమ్మడి గింజలు (Pumpkin Seeds): వీటిలో జింక్, మెగ్నీషియం, ఐరన్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని వేయించుకుని నేరుగా తినవచ్చు లేదా సూప్‌లు, సలాడ్లలో కలుపుకోవచ్చు.
2. అవిసె గింజలు (Flaxseeds): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి జుట్టు కుదుళ్లను దృఢపరుస్తాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. స్మూతీలు లేదా సలాడ్స్‌లో వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. చియా గింజలు (Chia Seeds): బరువు తగ్గడానికి ఉపయోగపడే చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికం. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. వీటిని నీళ్లలో నానబెట్టి లేదా పెరుగులో కలుపుకుని తినవచ్చు.
ఇతర ఆహారాలు: శనగలు, సోయాబీన్స్, పప్పుధాన్యాలు మరియు పెరుగు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోండి. ప్రోటీన్ లోపం వల్ల జుట్టు పల్చబడటం, బలహీనపడటం జరుగుతుంది. అలాగే బయోటిన్, విటమిన్ బి అధికంగా ఉండే చిలగడదుంపలు (Sweet potato), అవకాడో మరియు డ్రై ఫ్రూట్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
