హోటల్ గదిలో మలయాళ నటిపై వేధింపుల అత్యాచారయత్నం; చెన్నైలో యువకుడి అరెస్ట్

చెన్నై: హోటల్ గదిలోని ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చిన ఒక యువకుడు మలయాళ నటిని అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. నటి కేకలు వేయడంతో నిందితుడు గది నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నాగపట్నంకు చెందిన సయ్యద్ అఫ్రిదీని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే: ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. షూటింగ్ నిమిత్తం సదరు యువ నటి చెన్నైకి వచ్చారు. ఆమె టీ నగర్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేశారు. సాయంత్రం సమయంలో ఆమె గదిలోని ఇంటర్‌కామ్ పనిచేయకపోవడంతో రిసెప్షన్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్ సరిచేయడానికి వచ్చిన 20 ఏళ్ల యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెల్ఫీ కోసం అడిగి.. ఆపై వేధింపులు: గదిలోకి వచ్చిన యువకుడు ఎదురుగా ఉన్నది సినీ నటి అని గుర్తించి, మొదట సెల్ఫీ కావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో, కనీసం కౌగిలించుకోవాలని (Hug) వేధించాడు. అతను బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో నటి గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన యువకుడు వెంటనే గది నుండి పారిపోయాడు.

నిందితుడు చెన్నైలోని ఒక కాలేజీలో విద్యార్థి అని, సదరు హోటల్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పోలీసులు విచారించగా అతను ఆరోపణలను తోసిపుచ్చాడు. అయితే నటి రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: