కోటాలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాజ్‌కుమార్ అనే జ్యువెలరీ వ్యాపారి తన కలెక్షన్‌ను చూపిస్తుండగా, అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. షోరూమ్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని అందరూ ఆందోళన చెందారు.
అయితే, షోరూమ్ యజమాని కుమారుడు ఏమాత్రం తడబడకుండా గొప్ప సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. వెంటనే రాజ్‌కుమార్‌కు సుమారు 10-15 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేశాడు. ఈ చికిత్సతో రాజ్‌కుమార్ ప్రాణాలు దక్కాయి. కొద్దిసేపటి తర్వాత ఆయన కోలుకుని తనంతట తానుగా నడుచుకుంటూ షోరూమ్ నుండి బయటకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
