ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎలా వృథా చేస్తున్నారో వివరించారు. ఈ ఐదు విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే సంపదను సృష్టించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
బఫెట్ చెప్పిన 5 ప్రధాన తప్పులు:
- క్రెడిట్ కార్డ్ వడ్డీ: మధ్యతరగతి చేసే అతిపెద్ద తప్పు క్రెడిట్ కార్డుల వాడకం. 18-20% భారీ వడ్డీ చెల్లించే అప్పులను ముందుగా తీర్చాలి. ఇంతటి భారీ వడ్డీని మించిన లాభాన్ని ఇచ్చే పెట్టుబడి ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
- కొత్త కారు కొనడం: కారు అనేది కేవలం ప్రయాణం కోసం మాత్రమే ఉండాలి, హోదా (Status) కోసం కాదు. కొత్త కారు కొన్న మరుక్షణమే దాని విలువ పడిపోతుంది. దాని కోసం లోన్ తీసుకుని వడ్డీ కట్టడం వల్ల సంపద పెరగదు.
- జూదం మరియు లాటరీ: అదృష్టాన్ని నమ్ముకుని జూదం లేదా లాటరీ టిక్కెట్లపై డబ్బు ఖర్చు చేయడం వృథా. ఆ డబ్బును ఏదైనా వ్యాపారంలో లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం మంచిది.
- అవసరానికి మించిన పెద్ద ఇల్లు: లోన్లు తీసుకుని మరీ అవసరానికి మించిన పెద్ద ఇల్లు కట్టడం వల్ల సంపాదనంతా దానికే సరిపోతుంది. బఫెట్ స్వయంగా వేల కోట్లు ఉన్నప్పటికీ, 1958లో కొన్న చిన్న ఇంట్లోనే దశాబ్దాల పాటు నివసించారు.
- త్వరగా డబ్బు సంపాదించాలనే ఆత్రుత: పెట్టుబడి అనేది ఒక చెట్టు లాంటిది. ఈరోజు నాటితే అది నీడ ఇవ్వడానికి సమయం పడుతుంది. తొందరగా కోటీశ్వరులు అయిపోవాలనే ఆశతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు.
