చెన్నై, చెంగల్పట్టు: పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని దాచిపెట్టి, ఒక యువకుడిని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో వెలుగుచూసింది.
అసలేం జరిగింది?
చెంగల్పట్టు జిల్లా పట్టెక్కాడు గ్రామానికి చెందిన విక్రమన్ (23) అనే యువకుడు, నగరంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పనికి వెళ్లిన విక్రమన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు గాలింపు చేపడుతుండగా, విక్రమన్ తనకంటే వయసులో పెద్దదైన విజయలక్ష్మి అనే మహిళతో కలిసి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. తాము పెళ్లి చేసుకున్నామని, రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
బయటపడ్డ నిజాలు:
- నమ్మించి మోసం: విక్రమన్ పనిచేస్తున్న అదే జ్యువెలరీ షాపులో విజయలక్ష్మి ఒక నెల క్రితమే పనిలో చేరింది. కేవలం నెల రోజుల్లోనే విక్రమన్ను తన మాయమాటలతో లొంగదీసుకుంది.
- పిల్లల విషయం దాచింది: తనకు ఇదివరకే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఆమె విక్రమన్కు చెప్పలేదు.
- వారసుడు కలిగే అవకాశం లేదు: ఇద్దరు పిల్లలు చాలనుకుని విజయలక్ష్మి ఇదివరకే కుటుంబ నియంత్రణ (Family Planning) ఆపరేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని కూడా దాచిపెట్టి విక్రమన్ను పెళ్లి చేసుకుంది.
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు:
ఈ నిజాలు తెలుసుకున్న విక్రమన్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలిపోయారు. “నా కొడుక్కి కనీసం ఒక వారసుడు పుట్టే అవకాశం కూడా లేకుండా చేశావే.. ఇప్పుడు వేరే వాడి పిల్లలను పెంచాల్సిన పరిస్థితి కల్పించావే” అని వారు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కదిలించింది.
అయితే, ఇవేమీ పట్టించుకోని విజయలక్ష్మి.. ఏమాత్రం సంకోచం లేకుండా పోలీస్ స్టేషన్ నుండి విక్రమన్ చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
