అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్లా వాడుకుని పడేసింది: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆవేదన

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో తాలిబన్ల అంశంపై మాట్లాడుతూ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. అఫ్గానిస్థాన్ గడ్డపై జరిగిన రెండు యుద్ధాల్లోనూ పాకిస్థాన్ ఇస్లాం రక్షణ కోసం పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు.

జిహాద్ పేరుతో తమ దేశ ప్రజలను ఆ యుద్ధాల్లోకి నెట్టి చంపించారని, అయినప్పటికీ పాకిస్థాన్ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని ఆయన అంగీకరించారు. ఈ యుద్ధాలకు మద్దతుగా తమ విద్యా పాఠ్యప్రణాళికను (Curriculum) కూడా మార్చామని, వాటిని ఇప్పటికీ సరిదిద్దలేకపోయామని చెప్పారు.

ముఖ్య అంశాలు:

  • టిష్యూ పేపర్లా వాడారు: 1999 తర్వాత అమెరికా మద్దతు కోసం పాకిస్థాన్ మళ్ళీ యుద్ధంలో చేరిందని, దానికి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఆసిఫ్ అన్నారు. జనరల్ జియా-ఉల్-హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్ణయాలను విమర్శిస్తూ.. పాకిస్థాన్‌ను టాయిలెట్ పేపర్ కంటే అధ్వాన్నంగా, టిష్యూ పేపర్లా వాడుకుని వదిలేశారని మండిపడ్డారు.
  • ఇతరుల యుద్ధంలో పావుగా: 1980ల్లో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వెనుక అమెరికా ఉందని, అప్పటి పాక్ ప్రభుత్వం అమెరికా అండ కోసం తమ ప్రజలను ఆ యుద్ధంలోకి పంపి పెద్ద తప్పు చేసిందని ఆయన వాదించారు.
  • తాలిబన్లతో వైరం: “అమెరికా కోసం 2001లో మేము తాలిబన్లకు వ్యతిరేకమయ్యాము. అమెరికా వెళ్ళిపోయింది కానీ, మేము ఇప్పటికీ ఆ నష్టాన్ని అనుభవిస్తున్నాం. దీనిని ఎప్పటికీ పూడ్చలేము” అని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

Posted

in

by

Tags: