సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు గుండెల్ని పిండేసేలా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియోనే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఒక పెట్రోల్ బంక్ యజమాని పెట్టిన వింత పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా పెట్రోల్ పంపుల వద్ద ‘ధూమపానం నిషేధం’ వంటి హెచ్చరికలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం హెచ్చరికతో పాటు రాసిన ఒక వాక్యం చూసి జనం ఆశ్చర్యపోవడమే కాదు, నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
పోస్టర్‌పై ఏమని రాసి ఉంది? ఆ పోస్టర్‌పై స్పష్టమైన అక్షరాలతో ఇలా ఉంది: “ధూమపానం నిషేధించబడింది. మీ జీవితం పనికిరానిదై ఉండవచ్చు, కానీ మా పెట్రోల్ మాత్రం చాలా ఖరీదైనది.”
అంటే, మీరు సిగరెట్ వెలిగించి మీ ప్రాణాలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ, మీ వల్ల మా ఖరీదైన పెట్రోల్ కాలిపోకూడదు అనే వ్యంగ్యార్థంతో దీనిని రాశారు. పెట్రోల్ వంటి మండే స్వభావం ఉన్న వస్తువుల దగ్గర ధూమపానం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు, కానీ ఈ పోస్టర్ ఆ హెచ్చరికను చాలా భిన్నమైన శైలిలో అందించింది.
నెటిజన్ల స్పందన: ఈ వీడియోను @FI_InvestIndia అనే యూజర్ షేర్ చేస్తూ, “ఈ పెట్రోల్ పంప్ యజమానికి ఎవరో ఒకరు అవార్డు ఇవ్వాలి” అని ఫన్నీగా రాశారు. ఈ వీడియోకు ఇప్పటికే 1.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక సాధారణ హెచ్చరిక బోర్డును ఇంత వెటకారంగా, సూటిగా రాయడం ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశమైంది.
