మూసి ఉన్న ఇంట్లో మద్యం విందు.. లోపలికి ఎట్టి చూస్తే ఎవరో తెలిసి షాక్!

తమిళనాడులోని తిరుపూర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నెరుప్పెరిచ్చల్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేటి తరం యువత క్రమశిక్షణ, భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

అసలేం జరిగింది? తిరుపూర్‌కు చెందిన 17 ఏళ్ల ఒక బాలికకు అదే ప్రాంతంలో తన బంధువుకు చెందిన ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఆ ఇల్లు కొంతకాలంగా మూసి ఉంది. ఆ బాలిక తన స్నేహితులతో కలిసి ఆ ఖాళీ ఇంటి లోపలికి వెళ్ళింది. చాలా సేపటి వరకు ఆ ఇంటి నుండి అరుపులు, కేకలు వినబడటంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి తలుపు తట్టారు. లోపల ఉన్న వారి పరిస్థితి చూసి వారు షాక్‌కు గురయ్యారు. అక్కడ ఉన్న వారంతా మద్యం మత్తులో తూలుతూ పడి ఉన్నారు.

9 మంది విద్యార్థులు: వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా, ఆ గదిలో 6 గురు బాలికలు, ముగ్గురు బాలురు సహా మొత్తం 9 మంది ఉన్నారు. వీరంతా 15 నుండి 18 ఏళ్ల లోపు వయసు గలవారని, కొందరు ఇటీవల ప్లస్ టూ (ఇంటర్మీడియట్) పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులని తేలింది.

తల్లిదండ్రుల కన్నీరు: పోలీసులు ఆ 9 మందిని స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రులను పిలిపించారు. తమ పిల్లలు ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తున్నారని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయాలను నిశితంగా గమనించాలని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, గట్టిగా మందలించి వారిని తల్లిదండ్రులతో పంపించివేశారు.


Posted

in

by

Tags: