సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హాస్యభరితమైన వీడియోలో, ఒక బుజ్జాయి తన తల్లితో తనకు ఒంటరిగా నిద్రపోవాలంటే భయంగా ఉందని, తానూ ఆమెతోనే వచ్చి పడుకుంటానని అడుగుతాడు.
దానికి ఆ తల్లి, “నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు, ఇక నుండి ఒంటరిగానే పడుకోవాలి” అని బుజ్జగిస్తూ సలహా ఇస్తుంది. తన భయాన్ని పోగొట్టడానికి తల్లి ప్రయత్నించినప్పటికీ, ఆ చిన్నారి అడిగిన మరుసటి ప్రశ్న తల్లిని నోరుమెదపలేని పరిస్థితిలోకి నెట్టేసింది.
ఆ సంభాషణ ఇలా సాగింది:
చిన్నారి: “అమ్మా, నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది! నేను నీతో వచ్చి పడుకోవచ్చా?”
తల్లి: “నువ్వు పెద్దవాడివి అయ్యావు కదా! ఇకపై ఒంటరిగానే నిద్రపోవాలి!”
చిన్నారి: “నాన్న నాకంటే పెద్దవారు కదా! ఆయన మాత్రం ఎందుకు నీతోనే పడుకుంటున్నారు?”
తల్లి చెప్పిన సమాధానం విన్న ఆ బాబు ఏమాత్రం ఆలోచించకుండా, “నాన్న నాకంటే పెద్దవాడే కదా, ఆయన మాత్రం ఎందుకు నీతో నిద్రపోతున్నారు?” అని లాజిక్ తో అడిగిన ప్రశ్నకు ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. చూసేవారిని కడుపుబ్బ నవ్వించే ఈ చిన్నారి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
