నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సౌందర్య సమస్య జుట్టు త్వరగా నెరవడం. దీనిని కప్పిపుచ్చడానికి చాలా మంది కెమికల్ డైలను ఉపయోగిస్తుంటారు. అయితే, ఇవి జుట్టుకు హాని చేయడమే కాకుండా, కాలక్రమేణా తెల్ల జుట్టు మరింత పెరిగేలా చేస్తాయి.
జుట్టు సంరక్షణలో ఎప్పుడూ సహజ సిద్ధమైన మార్గాలను అనుసరించడమే ఉత్తమం. తెల్లబడిన జుట్టును సహజంగా నల్లబరచడానికి మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి కరివేపాకు అద్భుతంగా సహాయపడుతుంది.
కరివేపాకు ప్రయోజనాలు: కరివేపాకులో విటమిన్ A, B, C, E లతో పాటు కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, సహజంగా నల్లబడేలా చేస్తాయి. దీనికి మెంతులు కూడా తోడైతే జుట్టు వేగంగా పెరుగుతుంది మరియు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
ఉపయోగించే విధానం:
- ముందుగా మెంతులను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.
- మరుసటి రోజు ఆ మెంతులకు కరివేపాకులను కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని జుట్టుకు, తల మాడకు పట్టించాలి.
- 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
- వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.
