కూతురి కాపురం కూల్చింది, అల్లుడిని దోచుకుంది, ఇప్పుడు బావతో పరార్! బంధాలను ఖూనీ చేసిన అత్త కొత్త ‘ఎఫైర్’

అలీగఢ్‌లో బంధాల మర్యాదను మంటగలుపుతూ గత ఏడాది తన కూతురు పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో (అల్లుడు) పారిపోయి సంచలనం సృష్టించిన ఆ అత్త మళ్ళీ వార్తల్లోకిెక్కింది. సుమారు 10 నెలల పాటు అల్లుడితో కలిసి ఉన్న తర్వాత, ఆ ‘మోసకారి’ అత్త అతనికి కూడా వెన్నుపోటు పొడిచింది. ఈసారి ఆమె తన సొంత బావతో కలిసి పారిపోయింది.

అసలేం జరిగిందంటే? ఈ వింత ఉదంతం ఏప్రిల్ 2025లో ప్రారంభమైంది. అలీగఢ్‌లోని దాదోన్ ప్రాంతంలో ఒక యువతికి రాహుల్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉండగా, 12 రోజుల ముందే పెళ్లి కూతురు తల్లి.. కాబోయే అల్లుడితో కలిసి పరారైంది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా వదలకుండా, రూ. 5 లక్షల విలువైన నగలు, రూ. 3.5 లక్షల నగదు తీసుకుని వెళ్లిందని అప్పట్లో కూతురు కన్నీరుమున్నీరైంది.

బీహార్‌లో కాపురం: అల్లుడు రాహుల్‌కు ఆమె స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం, వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకోవడం చివరకు పారిపోవడానికి దారితీసింది. పోలీసులు వారిని బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పట్టుకున్నారు. అయితే తన భర్త తనను హింసిస్తున్నాడని, అందుకే బయటకు వచ్చానని ఆ అత్త వాదించింది. చట్టపరమైన ప్రక్రియ తర్వాత ఆమె అల్లుడితో వెళ్లడానికి పోలీసులు అనుమతించారు.

అల్లుడికి షాక్: గత 10 నెలలుగా వీరిద్దరూ బీహార్‌లో భార్యాభర్తల్లా నివసిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆమె తన బావతో కలిసి పారిపోయిందని రాహుల్ ఆరోపిస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్న రూ. 2 లక్షల నగదు, విలువైన నగలను కూడా పట్టుకుపోయిందని అతను వాపోతున్నాడు.

న్యాయం కోసం వేట: కూతురి కాపురం కూల్చి అత్తతో వెళ్లిన రాహుల్, ఇప్పుడు ఆమె కూడా తనను మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అలీగఢ్ పోలీసులను ఆశ్రయించగా, ఈ ఘటన బీహార్‌లో జరిగినందున అక్కడే కేసు పెట్టాలని వారు సూచించారు. దీంతో రాహుల్ ఇప్పుడు బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.


Posted

in

by

Tags: