“ఆస్కార్ విజేతకు సుప్రీంకోర్టు షాక్!”.. ‘పొన్నియిన్ సెల్వన్’ పాటతో మొదలైన కష్టాలు.. కోలీవుడ్‌లో కలకలం..!!!

‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలోని ‘వీర రాజా వీర’ పాట కాపీరైట్వి వాదంలో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ ఫయాజ్ వాసిఫుద్దీన్ దాగర్, తన తండ్రి మరియు బాబాయ్ రూపొందించిన ‘శివ స్తుతి’ అనే పాట మెట్టును (రాగం) రెహమాన్ అనుమతి లేకుండా వాడారని కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, రెహమాన్‌ను రూ. 2 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

గతంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం రెహమాన్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, పాత ఉత్తర్వులను తిరిగి అమలులోకి తెచ్చింది. ఇది కేవలం చట్టపరమైన పోరాటం మాత్రమే కాదని, సాంప్రదాయ శాస్త్రీయ సంగీత కళాకారుల కృషికి మరియు వారి ‘దాగర్వాణి’ సంగీత వారసత్వానికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ‘వీర రాజా వీర’ పాటలో దాగర్ సోదరుల సహకారాన్ని (Credit) తెలియజేస్తూ తగిన గుర్తింపు ఇచ్చేలా మార్పులు చేసే అవకాశం ఉందా అని రెహమాన్ తరపు న్యాయవాదులను కోర్టు వివరణ కోరింది.


Posted

in

by

Tags: