“ఈ అసమర్థుడిని, అవగాహన లేని వ్యక్తిని ఛైర్మన్‌ను చేశారు”.. పాక్ ఓటమి తర్వాత మొహ్సిన్ నఖ్వీపై విరుచుకుపడ్డ షోయబ్ అక్తర్

భారత్ చేతిలో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత, పాక్ మాజీ వేగవంతమైన బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై నిప్పులు చెరిగారు.

ఒక న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొన్న అక్తర్.. మొహ్సిన్ నఖ్వీకి అసలు క్రికెట్ గురించిన కనీస అవగాహన లేదని ఆరోపించారు. “క్రికెట్ తెలియని నఖ్వీ పీసీబీ ఛైర్మన్ అయ్యారు. ఆయన బాబర్‌ను సూపర్ స్టార్ అంటారు, కానీ బాబర్ పాకిస్థాన్‌కు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేడు. ఒక అసమర్థుడికి, అజ్ఞానికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం ప్రపంచంలోనే అతిపెద్ద నేరం” అని అక్తర్ మండిపడ్డారు.

నఖ్వీకి క్రికెట్ జ్ఞానం సున్నా క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి బోర్డు అధిపతి అయితే జట్టు ప్రదర్శన ఎలా బాగుంటుందని అక్తర్ ప్రశ్నించారు. బాబర్ ఆజంను అనవసరంగా హైప్ చేసి సూపర్ స్టార్‌ను చేశారని, కానీ అతను జట్టుకు విజయాన్ని అందించలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ జట్టు వరుస వైఫల్యాలతో అక్తర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

భారత్ అద్భుత విజయం ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో (10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది మరో చిరస్మరణీయ విజయం.


Posted

in

by

Tags: