గుండెపోటు; 48 గంటల ముందే శరీరం హెచ్చరించవచ్చు, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండెపోటు ఒకటి. ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గడమే దీనికి దారితీస్తుంది. సరైన సమయంలో చికిత్స అందితే ప్రాణాలను రక్షించవచ్చు, కానీ ఆలస్యమైతే ప్రాణాపాయం సంభవించవచ్చు. అయితే, గుండెపోటుకు 24 నుండి 48 గంటల ముందే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందని నిపుణులు మరియు వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రోడ్రోమల్ విండో (Prodromal Window): గుండెపోటుకు రెండు రోజుల ముందు శరీరం హెచ్చరిక సంకేతాలను చూపే దశను ‘ప్రోడ్రోమల్ విండో’ అంటారు. ఈ సమయంలో గుండెకు రక్త ప్రసరణలో అంతరాయం కలగడం ప్రారంభమవుతుంది. పూర్తిస్థాయిలో అడ్డంకి ఏర్పడకముందే గుండె ఒత్తిడికి లోనవుతుంది. ఈ సమయంలో లక్షణాలను గుర్తించి వైద్య సహాయం పొందితే ప్రమాదాన్ని నివారించవచ్చు.

గమనించాల్సిన లక్షణాలు:

  • అసాధారణ అలసట: ఏ చిన్న పని చేసినా, కొద్ది దూరం నడిచినా విపరీతమైన తలసట అనిపించడం. ఇది సాధారణ అలసట కంటే భిన్నంగా ఉంటుంది.
  • ఛాతీ నొప్పి/అస్వస్థత: ఇది కేవలం నొప్పిలా కాకుండా ఛాతీలో ఏదో బరువు పెట్టినట్లు, పట్టేసినట్లు అనిపిస్తుంది. చాలామంది దీనిని అసిడిటీ అని పొరబడతారు.
  • శ్వాస ఆడకపోవడం: కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం.
  • చెమటలు మరియు వికారం: కారణం లేకుండా చల్లని చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, వాంతులు వచ్చేలా అనిపించడం మరియు విపరీతమైన ఆందోళన కలగడం

Posted

in

by

Tags: