తేనెటీగ లేదా కందిరీగ కుడితే ఏం చేయాలి? తప్పకుండా తెలుసుకోండి..!

తేనెటీగ (Bee) లేదా కందిరీగ (Wasp) కుట్టినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ప్రమాదకర సంకేతాలు మరియు తక్షణ ప్రథమ చికిత్స గురించి పూర్తి వివరణ ఇక్కడ తెలుసుకోండి.

అవగాహన అవసరం: ప్రస్తుతం నగరాల్లో కూడా విషపూరుగుల సంచారం పెరుగుతోంది. గతంలో కేవలం గ్రామాల్లో మాత్రమే కనిపించే తేనెటీగలు, కందిరీగలు ఇప్పుడు నివాస ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి అకస్మాత్తుగా కుట్టినప్పుడు భయం చెందకుండా తక్షణమే స్పందించడం ఎలాగో తెలిసి ఉండాలి.

చేయకూడని పనులు:

  • కుట్టిన చోట గోకడం లేదా గిల్లడం చేయకూడదు.
  • విషాన్ని నోటితో పీల్చడానికి ప్రయత్నించకూడదు.
  • ఆ ప్రాంతంపై ఎక్కువ ఒత్తిడి కలిగించడం లేదా సొంతంగా ఏవో మందులు రాసేయడం చేయకూడదు.
  • కుట్టిన చోట ఉన్న ముల్లును (Stinger) చేత్తో గట్టిగా పట్టుకుని లాగకూడదు; అలా చేస్తే ముల్లులో మిగిలి ఉన్న విషం కూడా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల నొప్పి, వాపు పెరుగుతాయి.

వైద్యం ఎప్పుడు అవసరం? (ప్రమాద సంకేతాలు): కింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి:

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
  • ముఖం, పెదవులు, నాలుక లేదా గొంతు వాపు రావడం.
  • విపరీతమైన కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం.
  • వరుసగా వాంతులు అవ్వడం.
  • గుండె కొట్టుకునే వేగం పెరగడం.
  • ఒంటిపై ఎర్రటి దద్దుర్లు రావడం.

Posted

in

by

Tags: