చెవుల జాగ్రత్త: ఇయర్‌ఫోన్‌లు వాడేటప్పుడు మీరు ‘ఈ’ తప్పు చేస్తున్నారా? నిపుణుల హెచ్చరిక!

ఇయర్‌ఫోన్‌లను అతిగా మరియు పెద్ద శబ్దంతో వాడటం వల్ల చెవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. సురక్షితమైన వాల్యూమ్, పరిమిత వాడకం మరియు పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ నుండి స్మార్ట్ వాచ్ వరకు అన్నీ డిజిటల్ అయిపోయాయి. చాలా మంది బ్రాండెడ్ వస్తువులను, ముఖ్యంగా ఇయర్‌ఫోన్‌లను వాడటానికి ఇష్టపడతారు. అయితే, ఇవే ఇయర్‌ఫోన్‌లు మిమ్మల్ని చెవుడు (Deafness) బారిన పడేలా చేస్తాయని మీకు తెలుసా?

WHO హెచ్చరికలు: చాలా మంది ప్రయాణాల్లో లేదా ఖాళీ సమయాల్లో గంటల తరబడి ఇయర్‌ఫోన్‌లను చెవుల్లో పెట్టుకుని ఉంటారు. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దీనివల్ల కలిగే నష్టాలు ఇవే:

  1. వినికిడి లోపం: చిన్న వయస్సులోనే వినికిడి శక్తి తగ్గిపోతుంది. మొదట దూరంగా ఉన్నవారు మాట్లాడే మాటలు అర్థం కావు. పెద్ద శబ్దంతో సంగీతం వినేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ.
  2. ఇన్‌ఫెక్షన్లు: వాడిన తర్వాత ఇయర్‌ఫోన్‌లను ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల వాటికి సూక్ష్మ బ్యాక్టీరియా చేరుతుంది. వాటిని శుభ్రం చేయకుండా మళ్ళీ వాడటం వల్ల చెవిలో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
  3. కర్ణభేరిపై ప్రభావం: పెద్ద శబ్దం విన్నప్పుడు ధ్వని తరంగాలు చెవిలోని ‘కోక్లియా’ (Cochlea) లో ఉండే సున్నితమైన వెంట్రుకల వంటి కణాలపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల ఆ కణాలు మొద్దుబారిపోతాయి. కొన్నిసార్లు కర్ణభేరి (Ear Drum) దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

జాగ్రత్తలు:

  • ఇయర్‌ఫోన్‌లను తక్కువ సమయం మాత్రమే వాడండి.
  • వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
  • మీ ఇయర్‌ఫోన్‌లను రోజూ శుభ్రం చేయండి.
  • ప్రయాణాల్లో నిరంతరంగా పాటలు వినడం తగ్గించండి.

Posted

in

by

Tags: