ఏప్రిల్ 1 నుండి ఫామ్ 16, ఫామ్ 26AS ఉండవు; మీ జీతం మరియు రిటర్న్‌లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలులోకి రానుంది. దీనితో పాటు పన్నుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫారమ్‌ల పేర్లు మరియు నంబర్లు మారనున్నాయి. ముఖ్యంగా Form 16 మరియు Form 26ASలకు కొత్త నంబర్లు కేటాయించనున్నారు.

ప్రశ్న 1: ఫామ్ 16 మరియు ఫామ్ 26AS లలో జరిగే మార్పు ఏమిటి? జవాబు: కొత్త చట్టం ప్రకారం, ఫామ్ 16 పేరు Form 130గా, ఫామ్ 26AS పేరు Form 168గా మారుతాయి. ఈ మార్పు కేవలం నంబర్ మరియు నిర్మాణానికి (Structure) మాత్రమే పరిమితం. వీటి ఉపయోగం లేదా పన్ను చెల్లింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదు.

ప్రశ్న 2: దీనివల్ల పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారం పడుతుందా? జవాబు: లేదు. ఇది కేవలం పరిపాలనాపరమైన మార్పు మాత్రమే. పన్ను రేట్లు లేదా టీడీఎస్ (TDS) క్లెయిమ్ చేసే పద్ధతిలో ఎలాంటి మార్పు ఉండదు.

ప్రశ్న 3: కొత్త ఫారమ్‌లలో ఏ సమాచారం ఉంటుంది?

  • Form 130 (పాత Form 16): ఇందులో ఉద్యోగి జీతం, కట్ చేసిన TDS వివరాలు ఉంటాయి. దీనిని యజమాని (Employer) ఉద్యోగికి ఇస్తారు.
  • Form 168 (పాత Form 26AS): ఇది పన్ను పాస్‌బుక్ వంటిది. ఇందులో ఏడాది మొత్తం జరిగిన TDS మరియు ఇతర పన్ను క్రెడిట్ వివరాలు ఉంటాయి.

ప్రశ్న 4: “Previous Year” మరియు “Assessment Year” పదాల పరిస్థితి ఏమిటి? జవాబు: కొత్త చట్టం ప్రకారం ఈ పదాలను రద్దు చేసి, వాటి స్థానంలో కేవలం “Tax Year” అనే పదాన్ని వాడతారు. ఉదాహరణకు: టాక్స్ ఇయర్ 2026-27 అంటే ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు సంపాదించిన ఆదాయ కాలం. దీనివల్ల గందరగోళం తగ్గుతుంది.

ప్రశ్న 5: ఒకవేళ ఏడాదిలో ఉద్యోగం మారితే? జవాబు: ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేస్తే, ప్రతి కంపెనీ ఆ కాలానికి సంబంధించిన విడివిడి Form 130లను జారీ చేయాల్సి ఉంటుంది.


Posted

in

by

Tags: