సోషల్ మీడియాలో పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు రెండు పాములు కొట్టుకోవడం, మరికొన్నిసార్లు ఏదైనా జంతువును వేటాడటం మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పాము ఎవరినీ వేటాడటం లేదు, దేనితోనూ పోరాడటం లేదు. బదులుగా, ఒక విద్యుత్ తీగపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వార్తల్లో నిలిచింది.
ఆ పాము తీగపైకి ఎక్కగానే దానికి బలమైన విద్యుత్ ఘాతాం (Electric Shock) తగిలింది. అయినా సరే ఆ పాము తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా, ఎన్నిసార్లు తీగ ఎక్కితే అన్నిసార్లు షాక్ తింటూనే ఉంది.
వీడియోలో ఏముంది?
వీడియోను గమనిస్తే, అడవి లాంటి ప్రాంతంలో పొలానికి రక్షణగా కంచె వేసినట్లు కొన్ని తీగలు ఉన్నాయి. వాటిలో పైనున్న తీగకు విద్యుత్ ప్రసారం ఉంది. ఆ పాముకు అందులో కరెంట్ ఉందని తెలియదు కాబట్టి, పదేపదే పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిసారి దానికి షాక్ తగిలి కిందకు పడిపోతోంది. అదృష్టవశాత్తూ ఆ పాము తీగకు అంటుకుపోలేదు (Stick), లేదంటే అక్కడికక్కడే ప్రాణాలు పోయేవి.
లక్షల వ్యూస్ సంపాదించిన వీడియో
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్) లో @dn_xsoul అనే ఐడి ద్వారా షేర్ చేశారు. “పాములకు నిజంగా తెలివి ఉండదు.. మొదటిసారి షాక్ తగిలినా మళ్ళీ అక్కడికే వెళ్ళింది” అనే క్యాప్షన్‌తో దీనిని పోస్ట్ చేశారు. కేవలం 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల (2 Million) మందికి పైగా వీక్షించారు.
నెటిజన్ల ప్రతిస్పందన:
- ఒక యూజర్ స్పందిస్తూ.. “ఈ ఫెన్సింగ్‌లో వోల్టేజ్ తక్కువగా ఉంది, లేదంటే ఆ పాము చనిపోయేది” అని రాశారు.
- “ఈ పాము చాలా పెద్దదిగా, విషపూరితమైనదిగా కనిపిస్తోంది. కానీ వైర్లలో కరెంట్ ఉందని దానికి తెలియడం లేదు” అని మరొకరు కామెంట్ చేశారు.
- “ఏమీ జరగనట్లుగా అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం నమ్మశక్యం కావడం లేదు” అని ఇంకొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
