నోరు ఎండిపోవడం, నోటి దుర్వాసన మరియు నాలుకపై తెల్లటి పొర వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా, రోజుకు ఒకసారి మాత్రమే పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళ మధ్య ఆహార కణాలు ఇరుక్కుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి.
నోటి దుర్వాసన నికి ఇది ప్రధాన కారణం. నాలుకపై తెల్లటి పొర మరియు దుర్వాసన తరచుగా బ్యాక్టీరియా, శరీరంలో నీటి శాతం తగ్గడం మరియు జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంటాయి.
సులభమైన చిట్కాలు:
- బ్రెషింగ్ అలవాటు: ఉదయం మరియు రాత్రి రెండు పూటలా పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది పళ్ళ మధ్య ఆహార పదార్థాలు ఇరుక్కోకుండా చూస్తుంది.
- లవంగాలు మరియు యాలకులు: భోజనం తర్వాత ఒక లవంగం లేదా యాలక్కాయను నోట్లో వేసుకుని నమలండి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాను చంపుతాయి. లవంగం నూనె చిగుళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
- నాలుకను శుభ్రం చేయడం: పళ్ళు తోముకున్న ప్రతిసారీ నాలుకను క్లీనర్ లేదా ప్రత్యేక ద్రవంతో శుభ్రం చేయాలి. ఇది నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియా పొరను తొలగిస్తుంది.
- ఎక్కువ నీరు తాగడం: నోరు ఎండిపోకుండా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచి నోటిని శుభ్రంగా ఉంచుతుంది.
- దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్క పొడిని నీటిలో మరిగించి, ఆ నీటితో నోరు పుక్కిలించడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.
- పెరుగు తీసుకోవడం: ప్రతిరోజూ ఆహారంలో పెరుగును చేర్చుకుంటే శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది నోటి వాసనను అరికడుతుంది.
- దురలవాట్లకు దూరం: ధూమపానం, మద్యం మరియు అధిక మసాలాలు ఉన్న ఆహారాన్ని తగ్గించడం వల్ల నోటి దుర్వాసన అదుపు చేయవచ్చు.
క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియ నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న చిట్కాలు పాటించిన తర్వాత కూడా నోటి దుర్వాసన తగ్గకపోతే, అది చిగుళ్ళ వ్యాధి లేదా కడుపుకు సంబంధించిన తీవ్రమైన సమస్య కావచ్చు. అటువంటప్పుడు వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం అవసరం.
