నేటి నుండి కొత్త ఐటీ నిబంధనలు అమలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన; 36 గంటలు కాదు.. ఇక 3 గంటల్లోనే చర్యలు!

కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో రూపొందించిన ఫోటోలు, వీడియోలు లేదా ఆడియోలు ఇకపై లేబుల్ లేకుండా సోషల్ మీడియాలో కనిపించడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనల్లో చేసిన సవరణల ప్రకారం, ప్రతి ఏఐ కంటెంట్‌పై “AI Generated” అనే స్పష్టమైన లేబుల్ ఉండటం తప్పనిసరి.

ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదలైంది.

ముఖ్యమైన మార్పులు: సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం విధించిన అతిపెద్ద నిబంధన ఏమిటంటే.. ఏదైనా అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ఫిర్యాదు వస్తే, దానిని 3 గంటల్లోపు తొలగించాలి. గతంలో ఈ గడువు 36 గంటలుగా ఉండేది.

ప్రధాని మోదీ ‘న్యూట్రిషన్ లేబుల్’ ఉదాహరణ: ఫిబ్రవరి 19న జరిగిన ఏఐ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆహార పదార్ధాలపై ‘న్యూట్రిషన్ లేబుల్’ ఎలాగైతే ఉంటుందో, డిజిటల్ కంటెంట్‌కు కూడా అలాగే లేబుల్ ఉండాలని పేర్కొన్నారు. దీనివల్ల ఏది నిజమో, ఏది ఏఐ సృష్టించినదో సామాన్య పౌరులకు సులభంగా అర్థమవుతుంది.

ఏఐ లేబుల్ అంటే ఏమిటి?
  1. డిజిటల్ స్టాంప్: ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలపై స్పష్టంగా “AI Generated” అని కనిపించాలి. ఉదాహరణకు, ఒక నాయకుడి ప్రసంగాన్ని ఏఐతో తయారు చేస్తే, ఆ విషయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి.
  2. మెటాడేటా (డిజిటల్ DNA): ప్రతి ఫైల్ వెనుక సాంకేతిక సమాచారం ఉంటుంది. ఇందులో కంటెంట్ ఎప్పుడు తయారైంది, ఏ ఏఐ టూల్ వాడారు, మొదట ఏ ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేశారు అనే వివరాలు ఉంటాయి. ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు ఈ ‘టెక్నికల్ మార్కర్స్’ ద్వారా మూలాలను కనిపెట్టవచ్చు.
  3. లేబుల్ తొలగిస్తే కంటెంట్ డిలీట్: ఏఐ కంటెంట్‌పై ఉన్న వాటర్‌మార్క్ లేదా లేబుల్‌ను ఎడిట్ చేసి తొలగించడం చట్టవిరుద్ధం. ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే, ఆ కంటెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సోషల్ మీడియా కంపెనీలు సాంకేతికతను ఏర్పాటు చేయాలి.
శిక్షలు మరియు బాధ్యతలు:
  • నేరాలు: డీప్‌ఫేక్, అశ్లీలత, చైల్డ్ పోర్నోగ్రఫీ మరియు ఇతరుల గుర్తింపును దొంగిలించడం (Impersonation) వంటి పనులకు ఏఐని వాడితే కఠిన శిక్షలు తప్పవు.
  • యూజర్ బాధ్యత: ఏదైనా కంటెంట్ అప్‌లోడ్ చేసేటప్పుడు అది ఏఐ ద్వారా తయారైనదా కాదా అని యూజర్ వెల్లడించాలి. ఒకవేళ ఏఐ కంటెంట్ లేబుల్ లేకుండా ప్రచురితమైతే ఆ కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • సెఫ్ హార్బర్ రూల్: ఐటీ చట్టం సెక్షన్ 79 కింద సోషల్ మీడియా కంపెనీలకు లభించే రక్షణ (Safe Harbor), 3 గంటల్లోపు అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించకపోతే రద్దు చేయబడుతుంది.

శిక్షల వివరాలు (BNS ప్రకారం):

  • సెక్షన్ 353: తప్పుడు సమాచారంతో విద్వేషం వ్యాప్తి చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష.

Posted

in

by

Tags: