34 ఏళ్లకే మానవజాతిని కాపాడటానికి ప్రాణాలిచ్చిన ఆ గొప్ప శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ఆయన ఏం చేశారో తెలుసా?

నేటి ప్రపంచ అభివృద్ధి వెనుక ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. కొందరు తమ జీవితాలను ధారపోస్తే, మరికొందరు తమ పరిశోధన కోసం ప్రాణాలనే అర్పించారు. అటువంటి ఒక మహోన్నత శాస్త్రవేత్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

20వ శతాబ్దం ప్రారంభంలో, అమెరికన్ శాస్త్రవేత్త జెస్సీ విలియం లేజర్ ఎల్లో ఫీవర్ (మస్త్ జ్వరం) పై పరిశోధన చేస్తూ తన ప్రాణాలను త్యాగం చేశారు. ప్రమాదకరమైన వైరస్ ఉన్న దోమ తనను కుట్టేలా అనుమతించి, కొద్ది రోజుల్లోనే ఆ వ్యాధి బారిన పడి మరణించారు. తన మరణం ద్వారా, ఎల్లో ఫీవర్ వ్యాప్తికి దోమలే వాహకాలని నిరూపించి కోట్లాది మంది ప్రాణాలను కాపాడారు.

నేపథ్యం: 16వ శతాబ్దంలో ఆఫ్రికా నుండి అమెరికాకు వ్యాపించిన ఎల్లో ఫీవర్, ఉష్ణమండల ప్రాంతాల్లో వేగంగా విస్తరించింది. 1898లో స్పానిష్-అమెరికన్ యుద్ధం సమయంలో వేలాది మంది సైనికులు ఈ వ్యాధితో మరణించడంతో అమెరికా దీనిపై దృష్టి సారించింది.

కార్లోస్ ఫిన్లే సిద్ధాంతం: అంతకుముందు 20 ఏళ్ల క్రితమే క్యూబా వైద్యుడు కార్లోస్ ఫిన్లే.. ఎల్లో ఫీవర్ ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా కాకుండా దోమల ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. కానీ అప్పట్లో శాస్త్రవేత్తలు ఆయన మాటలను నమ్మి హేళన చేశారు.

ఎల్లో ఫీవర్ కమిషన్ పరిశోధన: పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా సైన్యం.. వాల్టర్ రీడ్, జేమ్స్ కరోల్, జెస్సీ డబ్ల్యూ. లేజర్ మరియు అరిస్టైడ్స్ అగ్రామోంటేలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని తేలడంతో, ఫిన్లే సిద్ధాంతాన్ని వీరు మరోసారి పరిశీలించారు.

దీనిని నిరూపించడానికి లేజర్ మరియు కారోల్ స్వచ్ఛందంగా ఎల్లో ఫీవర్ సోకిన దోమలతో కుట్టించుకున్నారు. కారోల్ కోలుకున్నప్పటికీ, లేజర్ మాత్రం సెప్టెంబర్ 25, 1900న కేవలం 34 ఏళ్ల వయస్సులో మరణించారు.

నిరూపణ: ఆ తర్వాత మరిన్ని ప్రయోగాలు చేశారు. రోగుల రక్తం, వాంతులు అంటిన పడకలపై పడుకున్న వారికి వ్యాధి సోకలేదు. కానీ దోమలున్న గదిలో ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యారు. దీనితో ఈ వ్యాధి కేవలం దోమల ద్వారానే వ్యాపిస్తుందని రూఢీ అయ్యింది. జెస్సీ లేజర్ ప్రాణ త్యాగం వైద్య చరిత్రను మార్చివేసింది.


Posted

in

by

Tags: