బైపాస్ సర్జరీ జరిగిన వారికి మళ్ళీ ఆంజియోగ్రామ్ అవసరమా?

గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ సాధారణ పరీక్షగా (Routine) ఆంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి అవుతుంది.

ఆంజియోగ్రామ్ ఎప్పుడు అవసరం?

  • సర్జరీ తర్వాత మళ్ళీ ఛాతీ నొప్పి (Chest Pain) వస్తున్నా.
  • నడుస్తున్నప్పుడు ఆయాసం లేదా ఛాతీ నొప్పితో పాటు ఎడమ చేయి, భుజం, వీపు లేదా దవడలో నొప్పి అనిపిస్తున్నా.
  • ECG లేదా Echo పరీక్షల్లో గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినట్లు తెలిసినా.
  • TMT (Treadmill Test) లేదా స్ట్రెస్ ఎకో పరీక్షల్లో రక్త ప్రసరణలో మార్పులు గమనించినా.
  • రక్త పరీక్షల్లో ‘ట్రోపోనిన్ ఐ’ (Troponin I) పాజిటివ్ అని వచ్చినా ఆంజియోగ్రామ్ అవసరం కావచ్చు.

రక్త నాళాల (Grafts) రకాలు – జాగ్రత్తలు: బైపాస్ సర్జరీలో వాడే రక్త నాళాలు రెండు రకాలు:

  1. ఆర్టీరియల్ గ్రాఫ్ట్ (LIMA): ఛాతీ భాగం నుండి తీసే ఈ నాళాల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ (10-15 ఏళ్లలో కేవలం 5-10% మందికి మాత్రమే వస్తాయి).
  2. వీనస్ గ్రాఫ్ట్: కాళ్ళ నుండి తీసే ఈ నాళాల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. 10 ఏళ్లలో దాదాపు 50% మందికి మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంది.

డయాబెటిస్, బీపీ, పొగత్రాగే అలవాటు ఉన్నవారికి మళ్ళీ బ్లాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఎటువంటి నొప్పి లేకుండా, ECG మరియు Echo రిపోర్టులు సాధారణంగా ఉంటే ఆంజియోగ్రామ్ అవసరం లేదు.


Posted

in

by

Tags: